Manjima Mohan : పెళ్ళిఫోటోల్లో కూడా లావుగా ఉన్నానని ట్రోల్ చేశారు..

మంజిమా మోహన్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ''నన్ను ట్రోల్ చేయడం ఇదేమి మొదటి సారి కాదు. గతంలో కూడా చాలా సార్లు నా బాడీపై కామెంట్స్ చేశారు. పెళ్లి ఫొటోల్లో లావుగా ఉన్నాను అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు. అసలు కొంతమంది...................

Manjima Mohan : పెళ్ళిఫోటోల్లో కూడా లావుగా ఉన్నానని ట్రోల్ చేశారు..

Manjima Mohan reacts about trolls coming on her body

Manjima Mohan :  హీరోయిన్ మంజిమా మోహన్ ఇటీవలే హీరో గౌతమ్ కార్తీక్ ని పెళ్లిచేసుకుంది. వీరి పెళ్లి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే మొదట్లో సన్నగానే ఉన్న మంజిమా ఇటీవల కొంచెం లావు అయింది. పెళ్ళికి కూడా లావుగానే ఉంది. కొంతమంది మంజిమా పెళ్ళికి కూడా లావుగా ఉందని ట్రోల్ చేస్తున్నారు. పెళ్లి తర్వాత ఓ తమిళ మీడియాకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తనపై వచ్చిన ట్రోల్స్ గురించి స్పందించింది.

మంజిమా మోహన్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ”నన్ను ట్రోల్ చేయడం ఇదేమి మొదటి సారి కాదు. గతంలో కూడా చాలా సార్లు నా బాడీపై కామెంట్స్ చేశారు. పెళ్లి ఫొటోల్లో లావుగా ఉన్నాను అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు. అసలు కొంతమంది పెళ్ళికి వచ్చినవాళ్లే నేను లావుగా ఉన్నాను అని కామెంట్స్ చేశారు. ఇలాంటి కామెంట్స్ పట్టించుకోవడం నేను ఎప్పుడో మానేశాను, నా బాడీ గురించి నాకు ఏ భాధ లేదు. ప్రస్తుతం నేను ఫిట్ గా, ఆరోగ్యంగా, సంతోషంగా ఉన్నాను. నాకు బరువు తగ్గాలనిపించినప్పుడు తగ్గుతాను” అని తెలిపింది.

Adivi Sesh : విశ్వక్‌సేన్‌కి తెలుసు అన్న తర్వాతే ఈ కథ వినడానికి ఒప్పుకున్నాను..

ఇక పెళ్లి తర్వాత సినిమాల గురించి మాట్లాడుతూ.. ప్రస్తుతం నా కెరీర్ బాగానే ఉంది. ఒక సినిమా కూడా చేస్తున్నాను. పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తాను అని తెలిపింది.