వార్‌తో ‘మర్దానీ 2’ ట్రైలర్

హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్, వాణీ కపూర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్.. 'వార్'.. థియేటర్లలో రాణీ ముఖర్జీ ప్రధాన పాత్రలో నటిస్తున్న 'మర్దానీ 2' ట్రైలర్ ప్రదర్శించనున్నారు..

  • Published By: sekhar ,Published On : September 27, 2019 / 05:39 AM IST
వార్‌తో ‘మర్దానీ 2’ ట్రైలర్

హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్, వాణీ కపూర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్.. ‘వార్’.. థియేటర్లలో రాణీ ముఖర్జీ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘మర్దానీ 2’ ట్రైలర్ ప్రదర్శించనున్నారు..

హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్, వాణీ కపూర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్.. ‘వార్’.. యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మించగా, సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేశాడు. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న హిందీతో పాటు తెలుగు, తమిళ్ భాషల్లోనూ విడుదల కానున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాతో రాణీ ముఖర్జీ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘మర్దానీ 2’ థియేట్రికల్ ట్రైలర్‌ను అటాచ్ చెయ్యనున్నారు. 2014లో వచ్చిన మర్దానీ చిత్రానికి సీక్వెల్గా రూపొందుతున్న ఈ సినిమాని గోపీ పుత్రన్ డైరెక్ట్ చేస్తుండగా.. యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్పై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నాడు. మహిళల అక్రమ రవాణా నేపథ్యంలో తెరకెక్కిన ఫస్ట్ పార్ట్ ఆడియన్స్‌ని ఆకట్టుకుంది.

Read Also : పూరీ పెద్దమనసు : డైరెక్టర్స్, కో-డైరెక్టర్స్‌కి ఆర్ధిక సహాయం..

రాణీ ముఖర్జీ నటనకు మంచి పేరు వచ్చింది. సెకండ్ పార్ట్ మరింత సీరియస్‌గా సాగుతుందట. రాణీ ముఖర్జీ ‘శివానీ శివాజీ రాయ్’ అనే పవర్ ఫుల్ పోలీస్ అధికారిణిగా కనిపించనుంది. రాజస్థాన్ బ్యాక్ డ్రాప్‌లో ఈ సినిమా రూపొందుతుంది. డిసెంబర్ 13న మర్దానీ 2 గ్రాండ్‌గా విడుదల కానుంది..