Masooda: బుల్లితెరపై కూడా మసూద హిట్టు.. టీఆర్పీ ఎంతో తెలుసా?

టాలీవుడ్‌లో హార్రర్ మూవీలకు ఎప్పటికీ మంచి ఆదరణ లభిస్తుందని ఇటీవల రిలీజ్ అయిన ‘మసూద’ మూవీ మరోసారి నిరూపించింది. పూర్తిగా హార్రర్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా వెండితెరపై ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఇక ఈ సినిమాను దర్శకుడు సాయి కిరణ్ తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోవడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.

Masooda: బుల్లితెరపై కూడా మసూద హిట్టు.. టీఆర్పీ ఎంతో తెలుసా?

Masooda Super Hit On Television Also

Masooda: టాలీవుడ్‌లో హార్రర్ మూవీలకు ఎప్పటికీ మంచి ఆదరణ లభిస్తుందని ఇటీవల రిలీజ్ అయిన ‘మసూద’ మూవీ మరోసారి నిరూపించింది. పూర్తిగా హార్రర్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా వెండితెరపై ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఇక ఈ సినిమాను దర్శకుడు సాయి కిరణ్ తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోవడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.

Masooda: బుల్లితెర ప్రేక్షకులను భయపెట్టేందుకు వస్తున్న మసూద

ఇక ఈ సినిమాలో సంగీత, తిరువీర్, బాంధవి శ్రీధర్ ముఖ్య పాత్రల్లో నటించారు. కాగా, ఈ సినిమా థియేట్రికల్ రన్‌లో మంచి విజయాన్ని అందుకోవడంతో, ఈ చిత్రాన్ని ఓటీటీలో స్ట్రీమింగ్ చేసింది చిత్ర యూనిట్. ఓటీటీలో కూడా ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి ట్రెమెండస్ రెస్పాన్స్ దక్కింది. ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడంతో ఓటీటీలోనూ మసూద ప్రేక్షకులను భయపెట్టింది. ఇక ఈ సినిమాను తాజాగా బుల్లితెరపై వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా టెలికాస్ట్ చేశారు.

Masooda: రేపు భయపడేందుకు సిద్ధంగా ఉండండి.. మసూద వచ్చేస్తోంది!

బుల్లితెరపై కూడా ప్రేక్షకులు మసూద చిత్రానికి ఫిదా అయ్యారు. ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు పెద్దసంఖ్యలో ఆసక్తిని చూపడంతో బుల్లితెరపై మసూద చిత్రానికి మంచి రెస్పాన్స్ దక్కింది. ఈ సినిమాకు 5.22 టీఆర్పీ రేటింగ్ వచ్చినట్లుగా తెలుస్తోంది. మసూద లాంటి సినిమాకు ఇలాంటి టీఆర్పీ రావడంతో ఈ సినిమా బుల్లితెరపై కూడా సెన్సేషన్ క్రియేట్ చేసిందని చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది.