‘లూసిఫర్’ వద్దు.. ‘వేదాళం’ ముద్దు..

  • Published By: sekhar ,Published On : August 19, 2020 / 04:11 PM IST
‘లూసిఫర్’ వద్దు.. ‘వేదాళం’ ముద్దు..

మెగాస్టార్ చిరంజీవి, కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ నటించిన మలయాళ సూపర్ హిట్ మూవీ ‘లూసిఫర్’ తెలుగు రీమేక్ హక్కులు తీసుకున్నారు. ప్రస్తుతం కొరటాల శివతో ‘ఆచార్య’ సినిమా చేస్తున్న చిరు.. ఆ తరువాత ‘లూసిఫర్’ కథలో మార్పులు చేయించి.. తనే సినిమా చేయాలని ప్లాన్ చేసుకున్నారు. కానీ ఏ ముహూర్తాన ఈ సినిమా చేద్దామనుకున్నారో.. సినిమాకు సంబంధించి ఒక్క పని కూడా సరిగా అవ్వలేదు. అందుకే విసుగొచ్చి చిరంజీవి ఏం చేశారో తెలుసా..?



చిరు ‘లూసిఫర్’ సినిమా చేద్దామనుకున్న దగ్గరనుంచి ఏదోక ఇష్యూ రన్ అవుతూనే ఉంది. లాస్ట్‌కి సినిమా ఆపేసి వేరే సినిమాకి షిఫ్ట్ అయ్యేంతగా విసిగించేసింది ఈ రీమేక్ ఆలోచన. ‘లూసిఫర్’ ని తెలుగు నేటివిటీకి మార్చి రీమేక్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు చిరంజీవి. అయితే ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ సుజిత్ రీమేక్ చేస్తున్నట్టు వార్తలు గట్టిగానే వినిపించాయి. ఇప్పటి వరకూ జస్ట్ రెండు(రన్ రాజా రన్, సాహో) సినిమాలే చేసిన సుజిత్‌కి చిరంజీవి ‘లూసిఫర్’ రీమేక్ బాధ్యతలు ఇచ్చారంటే అందరూ ఆశ్చర్యపోయారు.

Chiru 152



ఇంత పవర్‌ఫుల్ సబ్జెక్ట్‌ని టాలీవుడ్ ఆడియన్స్‌కి రీచ్ అయ్యేలా ఎలా తెరకెక్కిస్తాడో అని డౌట్ కూడా పడ్డారు. అందుకే మన నేటివిటీకి తగినట్టు మార్పులు చేయమని చెప్పారట చిరంజీవి. సుజిత్ చేసిన ఛేంజెస్ పెద్దగా నచ్చకపోవడం.. క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల సుజిత్‌ని ‘లూసిఫర్’ రీమేక్ నుంచి పక్కకు తప్పించారట చిరంజీవి. సుజిత్ ప్లేస్‌లో మెగాస్టార్ రీ ఎంట్రీలో సూపర్‌హిట్ ఇచ్చిన వి.వి. వినాయక్‌కి ‘లూసిఫర్’ రీమేక్ రెస్పాన్సిబిలిటీస్ అప్పజెప్పారు. అయితే ఆల్రెడీ ‘లూసిఫర్’ తెలుగు డబ్బింగ్ వెర్షన్‌‌ని చాలా మంది చూసెయ్యడంతో ఇపప్పుడు రీమేక్ చేసినా అంత ఎఫెక్ట్ ఉండదని డ్రాప్ అయ్యారు టీమ్.



Lusiferడైరెక్టర్‌ని తప్పించడమే కాదు.. ఈ కథను పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చేయబోతున్నట్టు సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అయ్యింది. దాంతో మెగాస్టార్ అప్పట్లోనే ఈ విషయంలో క్లారిటీ ఇచ్చారు. అలాంటిదేమి లేదు.. ఈ కథ నేనే చేస్తున్నాను.. అని చెప్తూ.. పవన్‌కు ఈస్టోరీ నచ్చితే, చేయాలని ఉంటే ఇచ్చేస్తాను అన్నారు చిరంజీవి. కానీ ప్రజెంట్ పవన్ కళ్యాణ్ మూడు సినిమాలతో బిజీగా ఉండడం, అసలు పవన్‌కు సూట్ అయ్యే కథ కాకపోవడంతో ఈ ఇష్యూ ఇక్కడితో ఎండ్ అయ్యింది.Vedalam



ఇన్ని తలనొప్పులతో సినిమా చెయ్యడం ఎందుకులే.. చేసినా పెద్దగా ఆడియన్స్‌లోకి వెళ్లదేమో అనుకుని మొత్తానికి సినిమాని పక్కన పెట్టేశారు. ఆ ప్లేస్‌లో తమిళ్ బ్లాక్ బస్టర్ ‘వేదాళం’ ను రీమేక్ చేద్దామనుకుంటున్నారని టాక్ నడుస్తోంది. ‘తల’ అజిత్, శివ డైరెక్షన్లో వచ్చిన ‘వేదాళం’ సినిమా అజిత్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు ఆ సినిమాని తెలుగులో రీమేక్ చెయ్యడం కోసం కసరత్తులు చేస్తున్నారట చిరంజీవి అండ్ టీమ్.