అదే క్లాస్ అదే గ్రేస్ – చిరు లేటెస్ట్ లుక్!

మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..

  • Published By: sekhar ,Published On : December 16, 2019 / 10:50 AM IST
అదే క్లాస్ అదే గ్రేస్ – చిరు లేటెస్ట్ లుక్!

మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..

మెగాస్టార్ చిరంజీవి, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందబోయే సినిమా దసరా పండుగ సందర్భంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన సంగతి తెలిసిందే. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి  కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు.

 

ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మెగాస్టార్ సరికొత్త లుక్‌లో కనిపించనున్నారు. అందుకోసం వర్కౌట్స్ చేస్తూ మేకోవర్ అవుతున్నారు. తాజాగా చిరు ఎయిర్ పోర్ట్‌లో ఉన్న పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

బ్లాక్ టీ షర్ట్, గాగుల్స్‌లో చిరు లుక్ సింప్లీ సూపర్బ్.. పాటతో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. చిరు సరసన కథానాయికలుగా త్రిష, నయనతార పేర్లు వినబడుతున్నాయి. మెలోడి బ్రహ్మ మణిశర్మ ఈ సినిమాకి సంగీతమందిస్తున్నారు.