మోహన్‌లాల్ @60: ప్రత్యేకతను చాటిచెప్పిన 5 నాన్-మళయాళీ సినిమాలు

  • Published By: Subhan ,Published On : May 21, 2020 / 11:08 AM IST
మోహన్‌లాల్ @60: ప్రత్యేకతను చాటిచెప్పిన 5 నాన్-మళయాళీ సినిమాలు

మళయాళ సినీ పరిశ్రమలో Mohanlal  పెద్ద స్టార్ అనే విషయం అందరికీ తెలిసిందే. మూడు దశాబ్దాలుగా కథానాయకుడి పాత్రలతో మెప్పిస్తూ.. మళయాళంలో అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఆ భాషలోనే కాకుండా మిగిలిన భాషల్లోనూ ఆయన స్పెషాలిటీని చాటుకున్నారు. ఆయన 60వ పుట్టిన రోజు సందర్భంగా మచ్చుకు ఓ 5సినిమాల గురించి చూద్దాం.

Iruvar 

మోహన్‌లాల్ నాన్ మళయాళీ సినిమాలో తొలిసారిగా లీడ్ రోల్ లో కనిపించింది మణిరత్నం డైరక్షన్ లో వచ్చిన ఇరువర్ లో. ఆనందం అనే పేరుతో ఎంజీ రామచంద్రన్ క్యారెక్టర్ పోషించారు. మోహన్ లాల్ పనితనం రుచి చూపించిన సినిమా అది. సినిమా తీస్తున్నప్పుడు మోహన్‌లాల్ రియలిస్టిక్ పర్‌ఫార్మెన్స్ కు మణిరత్నం కూడా మైమరచిపోయేవాడట. కొన్నిసార్లు కట్ చెప్పడం కూడా వదిలేసేవారట.

Company 
హిందీ సినిమాల్లోనూ ఆయన స్పెషాలిటీ చాటుకున్నారు. ఫిల్మ్ మేకర్ రామ్ గోపాల్ వర్మ తీసిన సినిమా కంపెనీ. అందులో ఐపీఎస్ వీరపల్లి శ్రీనివాసన్ రోల్ లో ఆయన కనిపించారు. మాఫియా లీడర్లు అజయ్ దేవగన్, వివేక్ ఒబెరాయ్ అండర్ కంట్రోల్ లో ఉండే సినిమా ఇది. ఈ సినిమాలోని పాత్రకు గానూ ఆయనకు బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ IIFA అవార్డు దక్కింది. 

Jilla 
మోహన్‌లాల్ తమిళసినిమాల్లోనూ కనిపించారు. స్టార్ హీరో విజయ్ తో పాటు జిల్లా సినిమాలో నటించారు. మధురైకు చెందిన డాన్ క్యారెక్టర్ లో కనిపించి విజయ్ అనే వ్యక్తిని దత్తత తీసుకుంటారు. అతని కుడి భుజంలా ఎదిగిన విజయ్ తర్వాత ఏం చేశాడా అనేదే సినిమా. మోహన్ లాల్ నటించడం ద్వారానే మళయాళీ ఇండస్ట్రీలో సినిమాకు అంత పేరు వచ్చింది. 

Unnai Pol Oruvan
తమిళ్ రీమేక్ సినిమా ఇది. ఒరిజినల్ సినిమాలో అనుపమ్ ఖేర్  పోషించిన పాత్రలో మోహన్ లాల్ కనిపించారు. ఇందులో కమల్ హాసన్ లీడ్ రోల్ యాక్టర్. కమల్ తో స్క్రీన్ షేర్ చేసుకుని ఆయన ప్రత్యేకతను మాత్రం తగ్గించుకోలేదు. 

Janatha Garage 
మోహన్‌లాల్ టాలీవుడ్‌లో ఎన్టీఆర్‌తో కనిపించిన సినిమా జనతా గ్యారేజి. ఆర్జీవీ సర్కార్ సినిమాను పోలిన సినిమాలో అదే వర్క్ షాప్ నిర్వహించే సత్యం క్యారెక్టర్ లో మోహన్ లాల్ కనిపిస్తారు. లోకల్ డాన్ లా ఉంటూ ఎన్టీఆర్ తో పాటు స్క్రీన్ షేర్ చేసుకున్నారు. 

Read:మోహన్‌లాల్ 60వ బర్త్ డే స్పెషల్: దృశ్యం-2 అనౌన్స్‌మెంట్