Mouni Roy : మ‌ల‌యాళీ, బెంగాలీ.. రెండు పద్ధతుల్లో మౌనిరాయ్ వివాహం.. వీడియో రిలీజ్

గత జ‌న‌వ‌రి 27న‌ మౌనిరాయ్ తన ప్రియుడు, వ్యాపార‌వేత్త‌ సూర‌జ్ నంబియార్‌ను పెళ్లి చేసుకుంది. ఈ వివాహం గోవాలో జరిగింది. అయితే వీరి వివాహం మ‌ల‌యాళీ, బెంగాలీ రెండు ప‌ద్ధ‌తిలో వీరి......

Mouni Roy : మ‌ల‌యాళీ, బెంగాలీ.. రెండు పద్ధతుల్లో మౌనిరాయ్ వివాహం.. వీడియో రిలీజ్

Mouni Roy

Mouni Roy :   ‘నాగిని’ సీరియ‌ల్ ఫేం, బాలీవుడ్ బుల్లితెర న‌టి, సోషల్ మీడియా స్టార్ మౌనీరాయ్ ఇటీవల వివాహం చేసుకుంది. గత జ‌న‌వ‌రి 27న‌ మౌనిరాయ్ తన ప్రియుడు, వ్యాపార‌వేత్త‌ సూర‌జ్ నంబియార్‌ను పెళ్లి చేసుకుంది. ఈ వివాహం గోవాలో జరిగింది. అయితే వీరి వివాహం మ‌ల‌యాళీ, బెంగాలీ రెండు ప‌ద్ధ‌తిలో వీరి వివాహం జ‌రిగింది అని తాజాగా తెలుస్తుంది. ఈ వేడుక‌కు ఇరు కుటుంబాల‌తో పాటు ప‌లువురు బాలీవుడ్ సెల‌బ్రిటీలు సైతం హాజరయ్యారు.

Allu Arjun : పునీత్ రాజ్ కుమార్ ఫ్యామిలీని పరామర్శించిన అల్లు అర్జున్

అయితే మొన్నటి వరకు వీరి సంగీత్‌, హల్దీ ఈవెంట్‌, వివాహ వేడుకకి సంబంధించిన ఫోటోలు మాత్రమే రిలీజ్ అయ్యాయి. ఈ ఫొటోల్లో మలయాళీ పద్దతిలో జరిగిన పెళ్లి ఫోటోలని మాత్రమే షేర్ చేశారు. ఇప్పటివరకు మౌనీరాయ్‌ వివాహ వేడుకకు సంబంధించిన వీడియో ఏది బయటకి రాలేదు. తాజాగా ఈ నాగిని బ్యూటీ నిన్న(బుధవారం) బెంగాలీ పద్దతిలో జరిగిన తన పెళ్లి వీడియోను షేర్‌ చేసింది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.