Mounika Reddy : ఏడు అడుగులు వేసేసిన మౌనిక రెడ్డి..

షార్ట్ ఫిలిమ్స్ తో కెరీర్ మొదలుపెట్టిన 'మౌనిక రెడ్డి'.. తన తన క్యూట్ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. అయితే కెరీర్ ఊపు అందుకుంటున్న సమయంలో ఏడు అడుగులు వేయడానికి సిద్దపడింది ఈ భామ. తన స్నేహితుడు ‘సందీప్ కురపాటి’ని ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నట్లు ఇటీవల ప్రకటించింది మౌనిక. ఈ నేపథ్యంలోనే..

Mounika Reddy : ఏడు అడుగులు వేసేసిన మౌనిక రెడ్డి..

Mounika Reddy married sunday

Mounika Reddy : షార్ట్ ఫిలిమ్స్ తో కెరీర్ మొదలుపెట్టిన ‘మౌనిక రెడ్డి’.. తన తన క్యూట్ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఆ ఫేమ్ తో ఒక ప్రముఖ ఛానల్ వెబ్ సిరీస్ లో నటించే ఛాన్స్ కొట్టేసింది. ఇక ఆ ఛాన్స్ తో అమ్మడు ఇండస్ట్రీలో ఒక గుర్తింపు సంపాదించుకుంది. ఇటీవలే షణ్ముఖ్‌ జశ్వంత్‌ తో కలిసి ‘సూర్య’ అనే వెబ్ సిరీస్ లో నటించి మంచి విజయం అందుకోవడంతో, సినిమా ఆఫర్లు కూడా రావడం మొదలుపెట్టాయి.

Mounika Reddy : కెరీర్ పీక్ స్టేజీలో ఉన్న సమయంలో.. పెళ్లి పీటలు ఎక్కుతున్న టాలీవుడ్ నటి..

ఈ నేపథ్యంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమాలో.. పవన్ పక్కన నటించి అందరి దృష్టిని ఆకర్షిచింది. తాజాగా విడుదలైన విశ్వక్ సేన్ ‘ఓరి దేవుడా’ సినిమాలో కూడా ఒక పాత్ర చేసింది. అయితే కెరీర్ ఊపు అందుకుంటున్న సమయంలో ఏడు అడుగులు వేయడానికి సిద్దపడింది ఈ భామ. తన స్నేహితుడు ‘సందీప్ కురపాటి’ని ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నట్లు ఇటీవల ప్రకటించింది మౌనిక.

ఇక పెళ్లి వేడుకలు గోవాలో రెండు రోజులు పాటు జరిగిని. డిసెంబర్‌ 17,18 తేదీల్లో జరిగిన ఈ డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ లో అత్యంత ఆత్మీయులైన కుటుంబసభ్యులు మరియు స్నేహితులు మాత్రమే హాజరయ్యారు. అయితే ఈ వేడుకలో టాలీవుడ్ నటి మరియు యాంకర్ వర్షిణి సందడి చేసింది. బారాత్ లో డాన్స్ లు వేసి పెళ్లిసందడి తెచ్చింది. ఈ ఆదివారం మౌనిక రెడ్డి, వరుడు సందీప్ తో ఏడు అడుగులు వేయడంతో అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభకాంక్షలు తెలుపుతున్నారు.