National Cinema Day: మల్టీప్లెక్స్‌లలో రూ.75 కే సినిమా.. ఎప్పుడంటే?
మల్టీప్లెక్స్‌లో సినిమా చేడాలని చాలా మంది కోరుకుంటారు. కానీ, ప్రస్తుతం ఉన్న సినిమా టికెట్ రేట్లకు భయపడి అక్కడ సినిమా చూసేందుకు ధైర్యం చేయడం లేదు. అయితే అలాంటి వారందరికీ మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(MIA) ఓ గుడ్ న్యూస్ చెప్పనుంది. నేషనల్ సినిమా డే(National Cinema Day) అయిన సెప్టెంబర్ 16న దేశవ్యాప్తంగా ఉన్న మల్టీప్లెక్స్‌లలో ప్రేక్షకులు సినిమా చూసేందుకు వీలును కలిపిస్తోంది MIA.

Multiplex Association Of India To Give Tickets At Rs 75 On National Cinema Day
National Cinema Day: మల్టీప్లెక్స్‌లో సినిమా చేడాలని చాలా మంది కోరుకుంటారు. కానీ, ప్రస్తుతం ఉన్న సినిమా టికెట్ రేట్లకు భయపడి అక్కడ సినిమా చూసేందుకు ధైర్యం చేయడం లేదు. అయితే అలాంటి వారందరికీ మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(MIA) ఓ గుడ్ న్యూస్ చెప్పనుంది. నేషనల్ సినిమా డే(National Cinema Day) అయిన సెప్టెంబర్ 16న దేశవ్యాప్తంగా ఉన్న మల్టీప్లెక్స్‌లలో ప్రేక్షకులు సినిమా చూసేందుకు వీలును కలిపిస్తోంది MIA.
Multiplex : మల్టిప్లెక్స్ లు కడుతున్న హీరోలు..
సెప్టెంబర్ 16న మల్టీప్లెక్స్‌లలో సినిమా టికెట్ రేటును రూ.75కే అందించాలని MIA నిర్ణయించింది. ఈ క్రమంలోనే దేశంలోని అన్ని నగరాలలో ఉన్న పీవీఆర్, ఐనాక్స్, ఏషియన్ వంటి మల్టీప్లెక్స్ థియేటర్లలో ఈ డిస్కౌంట్ రేటును అమలు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (MAI) థియేటర్ వ్యాపారాన్ని నిలబెట్టిన సినీ ప్రేక్షకులకు కృతజ్ఞతగా ఈ ఆఫర్ ప్రకటించింది. ఒక రోజు మాత్రమే తగ్గింపుతో.. 4000 కంటే ఎక్కువ మంది సినీ ప్రేక్షకులు వచ్చే థియేటర్లలో ఇది అందుబాటులో ఉంటుందని తెలిపింది.
ఏదేమైనా మల్టీప్లెక్స్‌లకు ఎక్కవ ప్రాధాన్యత ఇస్తున్న నేటి యూత్‌కు ఇది ఖచ్చితంగా గుడ్ న్యూస్ అని చెప్పాలి. మరి ఈ అవకాశాన్ని మీరు కూడా తప్పకుండా వినియోగించుకుంటారు కదా!