Mumaith Khan : బిగ్‌బాస్‌లో ముమైత్‌ఖాన్‌కి వారానికి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా??

మొదటి వారం బిగ్‌బాస్‌ తెలుగు నాన్ స్టాప్ లో ముమైత్‌ ఖాన్‌ ఎలిమినేట్‌ అయిన సంగతి తెలిసిందే. వారియర్స్ టీమ్‌ కంటెస్టెంట్ అయిన ముమైత్ కి నామినేషన్స్ లో అందరి కంటే తక్కువ ఓట్లు........

Mumaith Khan : బిగ్‌బాస్‌లో ముమైత్‌ఖాన్‌కి వారానికి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా??

Mumaith

Mumaith Khan :  బిగ్‌బాస్‌ తెలుగు నాన్‌స్టాప్‌ ఓటీటీలో కొనసాగుతున్న సగంతి తెలిసిందే. ఈ షో మొదటి వారం నుంచే మంచి రసవత్తరంగా సాగుతుంది. గొడవలు, ఏడుపులు, పగలు.. ఇలా షో రోజు రోజుకి మరింత ఆసక్తికరంగా మారుతుంది. బిగ్‌బాస్‌ అభిమానులు షోని క్రమం తప్పకుండా చూస్తున్నారు. 24 గంటలు లైవ్ ఇవ్వడంతో షోకి మరింత క్రేజ్ పెరిగింది. ఇప్పటికే వారం రోజులు పూర్తయి రెండో వారంలో దూసుకుపోతుంది ఈ రియాల్టీ షో.

మొదటి వారం బిగ్‌బాస్‌ తెలుగు నాన్ స్టాప్ లో ముమైత్‌ ఖాన్‌ ఎలిమినేట్‌ అయిన సంగతి తెలిసిందే. వారియర్స్ టీమ్‌ కంటెస్టెంట్ అయిన ముమైత్ కి నామినేషన్స్ లో అందరి కంటే తక్కువ ఓట్లు రావడంతో ఆమె బిగ్‌బాస్‌ హౌస్ నుండి బయటకి వెళ్ళింది. మొదటి వారంలోనే ఎలిమినేట్ అయిన ముమైత్ స్టేజి మీదకి వచ్చి.. తాను ఇంత తొందరగా బయటకు వస్తానని ఊహించలేదంటూ ఎమోషనల్‌ అయ్యింది.

Rashmika Mandanna : ఉమెన్స్‌డే రోజు బోల్డ్ ఫొటోలతో మ్యాగజైన్ పై రచ్చ చేసిన రష్మిక

ఇక సెలబ్రిటీలు చాలా మంది బిగ్‌బాస్‌ షోకి డబ్బుల కోసమో లేక ఫేమ్ కోసమో వస్తారని సంగతి తెలిసిందే. ఈ సారి ముమైత్ మొదటి వారంలోనే బయటకి రావడంతో తన రెమ్యునరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బిగ్‌బాస్‌ లో పార్టిసిపేట్ చేసే కంటెస్టెంట్స్ కి వారానికి ఇంత అని ఇస్తారు. గత సీజన్స్ నుంచి ఇలాగే నడుస్తుంది. ఆర్టిస్ట్ రేంజ్, బయట వాళ్ళ ఫాలోయింగ్ ని బట్టి వారికి వారానికి ఇంత అని రెమ్యునరేషన్ ఇస్తారు. ఈ నేపథ్యంలో ముమైత్ ఖాన్ కి ఒక వారానికి గాను 90 వేలు పారితోషికం ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. ఒక్క వారానికి 90 వేలు అంటే అది మంచి పారితోషికమే. ఆమె ఇంకా ఎక్కువ రోజులు ఉండుంటే ఇంకా ఎక్కువ సంపాదించే అవకాశం ఉండేది.