నువ్వు దూరమవ్వకే ఊపిరి ఆగిపోద్ది నా వల్ల కాదే..

నువ్వు దూరమవ్వకే ఊపిరి ఆగిపోద్ది నా వల్ల కాదే..

‘రొమాంటిక్’ మూవీలోని ‘నా వల్ల కాదే’ లిరికల్ సాంగ్ విడుదల..

నువ్వు దూరమవ్వకే ఊపిరి ఆగిపోద్ది నా వల్ల కాదే..

‘రొమాంటిక్’ మూవీలోని ‘నా వల్ల కాదే’ లిరికల్ సాంగ్ విడుదల..

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తనయుడు ఆకాష్ పూరి, కేతిక శర్మ జంటగా నటిస్తున్న యూత్ ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్.. ‘రొమాంటిక్’.. అనిల్ పాదూరి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. పూరి కనెక్ట్స్, పూరి జగన్నాధ్ టూరింగ్ టాకీస్ బ్యానర్స్‌పై పూరి, చార్మి నిర్మిస్తున్నారు.

ROMANTIC

తాజాగా ఈ సినిమాలోని ‘నా వల్ల కాదే’ అనే లిరికల్ సాంగ్ విడుదల చేశారు. సునీల్ కశ్యప్ ట్యూన్ కంపోజ్ చేసి చాలా బాగా పాడాడు.. భాస్కరభట్ల లిరిక్స్ రాశారు.. ‘‘నా వల్ల కాదే.. నువ్వు దూరమవ్వకే ఊపిరి ఆగిపోద్ది నా వల్ల కాదే.. నువ్వు దూరమవ్వకే గుండె ఆగిపోద్ది నా వల్ల కాదే.. నువ్వు లేకపోతే బ్రతకలేనులే.. నిన్నే నా మనసుతో ఎపుడైతే చూశానో..

అపుడే నా మనసుతో ముడి వేసుకున్నానే.. కళ్లనుంచి నీరులాగా నువ్వు జారగా.. కాళ్ల కింద భూమి జారినట్టు ఉందిగా’’ అంటూ సాగే ఈ పాట మనసుకి హత్తుకునేలా ఉంది.
కథ, స్క్రీన్‌ప్లే, మాటలు : పూరి జగన్నాధ్, సినిమాటోగ్రఫీ : నరేష్ రానా, ఎడిటింగ్ : జునైద్ సిద్ధిఖీ, మ్యూజిక్ : సునీల్ కశ్యప్, సమర్పణ : శ్రీమతి లావణ్య. 

×