Varudu Kaavalenu: ఫ్యామిలీ ఆడియన్స్‌ని టార్గెట్ చేస్తున్న నాగశౌర్య.. ఫలితమేంటో?

ఈ శుక్రవారం రిలీజ్ అవుతున్న సినిమాల్లో ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తున్న సినిమా వరుడు కావలెను. ఆ మధ్య లవ్, యాక్షన్ మూవీస్ చేసి అంతగా ఆకట్టుకోలేకపోయిన నాగశౌర్య..

Varudu Kaavalenu: ఫ్యామిలీ ఆడియన్స్‌ని టార్గెట్ చేస్తున్న నాగశౌర్య.. ఫలితమేంటో?

Naga Shaurya

Varudu Kaavalenu: ఈ శుక్రవారం రిలీజ్ అవుతున్న సినిమాల్లో ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తున్న సినిమా వరుడు కావలెను. ఆ మధ్య లవ్, యాక్షన్ మూవీస్ చేసి అంతగా ఆకట్టుకోలేకపోయిన నాగశౌర్య.. ఈసారి టార్గెట్ మార్చి హిట్ మీద ఫోకస్ చేసిన సినిమా వరుడు కావలెను. ఈ సినిమాలో ఇంట్రస్టింగ్ ఎలిమెంట్స్ ఎన్నో ఉన్నాయని యూనిట్ ధీమాగా చెప్తుంది.

Mehreen Pirzada: ముచ్చెమటలు పుట్టించే మెరుపుతీగ మెహ్రీన్!

నాగశౌర్య ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చెయ్యడానికి అన్ని రకాలుగా రెడీ అయ్యాడు. శౌర్య, రీతూవర్మ జంటగా లక్ష్మీ సౌజన్య డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం ధియేటర్లోకొస్తోంది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ లో గ్రాండ్ గా తెరకెక్కిన వరుడు కావలెను ఇంట్రస్టింగ్ ఎలిమెంట్స్ తో ఆడియన్స్ ముందుకు రాబోతోంది.

Ketika Sharma: అట్రాక్ట్ చేస్తున్న రొమాంటిక్ పిల్ల.. క్యూ కడతారా?

వరుడు కావలెను అంటూ క్యాచీ ఇంట్రస్టింగ్ టైటిల్ తోనే సగం ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేసిన టీమ్.. కంటెంట్ తో గ్యారంటీగా సక్సెస్ కొడుతుందని ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఇప్పటి వరకూ నాగశౌర్య ఏ సినిమాకీ చేయనంత రేంజ్ లో ఈ సినిమా ప్రమోషన్స్ చేస్తున్నారు. రానా, పూజాహెగ్డే, బన్నీ ఇలా స్టార్ కాస్ట్ ప్రమోషన్స్ తో సినిమా మీద ఎక్స్ పెక్టేషన్స్ పెంచేశారు టీమ్.

Puri Jagannadh: పూరి కూతురు హీరోయిన్.. ఆకాష్ ఏం చెప్పాడంటే?

ఈ మధ్య వరుసగా ఫ్లాపులు ఎదుర్కొంటున్న నాగశౌర్య ఈ సినిమాతో హిట్ కొట్టడం గ్యారంటీ అంటూ బజ్ క్రియేట్ అయ్యింది. కోవిడ్ వల్ల సంవత్సరం లేట్ అయిన ఈసినిమా ఈ శుక్రవారం రిలీజ్ అవుతోంది. ఆల్రెడీ ఓవర్సీస్ లో హిట్ బజ్ తో రిలీజ్ అయిన సినిమా పాజిటివ్ బజ్ తో రన్ అవుతోంది. స్టైలిష్ లుక్ తో, హ్యాండ్సమ్ గా నాగశౌర్య, పవర్ పుల్ స్ట్రాంగ్ విమెన్ రోల్ లో రీతూ.. నటించిన వరుడు కావలెను గ్యారంటీగా ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేస్తుందని ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉంది టీమ్.