Agent – Custody : ఏజెంట్, కస్టడీ చిత్రాల విజయం కోసం.. తిరుమలకు నాగార్జున, అమల..
అఖిల్ అండ్ చైతన్య సినిమాల విజయం కోసం నాగార్జున, అమల తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శించుకొని పూజలు నిర్వహించారు.

Nagarjuna Amala visit Tirumala for Agent Custody
Agent – Custody : అక్కినేని నాగార్జున చివరిగా ‘ది ఘోస్ట్’ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ఆ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా విజయం సాధించలేక పోయింది. ప్రస్తుతం అక్కినేని అభిమానులు నాగార్జున 100వ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. అయితే నాగార్జున మాత్రం తన మూవీ కోసం కాకుండా తన కొడుకుల సినిమాల కోసం దేవుడికి పూజలు నిర్వహిస్తున్నాడు. నాగచైతన్య (Naga Chaitanya) కస్టడీ, అఖిల్ (Akhil Akkineni) ఏజెంట్ చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. దీంతో ఈ సినిమాలు విజయం సాధించాలని తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శించుకున్నారు నాగార్జున, అమల.
Agent Movie : పోకిరి, బాహుబలి 2.. ఇప్పుడు అఖిల్ ఏజెంట్.. ఆ సెంటిమెంట్ రిపీట్ అవ్వుద్దా?
దర్శనం అనంతరం నాగార్జున మీడియాతో మాట్లాడుతూ.. నా ప్రాజెక్ట్ లు కోసం కాదండి, నా కొడుకుల సినిమాల కోసం తిరుమల వచ్చాను. చైతన్య కస్టడీ, అఖిల్ ఏజెంట్ సినిమాలు రిలీజ్ కి రెడీ అయ్యాయి. ఆ సినిమా కోసం ఇద్దరు చాలా కష్ట పడ్డారు. అయితే వాళ్ళ కష్టమే కాదు వేంకటేశ్వరుడి అశీసులు కూడా కావాలి కదా. అందుకనే ఆయనికి మొక్కుకుందాం అని వచ్చాము” అంటూ వెల్లడించాడు. కాగా ఏజెంట్ సినిమా ఏప్రిల్ 28న, కస్టడీ మే 12న రిలీజ్ కానున్నాయి.
Custody Movie: కస్టడీ నుండి బిగ్ అప్డేట్ ఇచ్చిన చైతూ.. ఫ్యాన్స్ గెట్ రెడీ!
ఈ రెండు సినిమాలు మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్నాయి. చైతన్య అండ్ అఖిల్ ఈ చిత్రాలతో ఎలైన మాస్ ఇమేజ్ ని సొంతం చేసుకోవాలని చూస్తున్నారు. ఏజెంట్ మూవీలో అఖిల్ స్పైగా నటిస్తుండగా, కస్టిడీలో చైతన్య పోలీస్ పాత్ర చేస్తున్నాడు. సురేందర్ రెడ్డి ఏజెంట్ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తుండగా, కస్టడీని తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కాబోతుండగా.. ఏజెంట్ తెలుగు, మలయాళ భాషల్లో రిలీజ్ కాబోతుంది.
Pillalu entha kastapadina tallitandrulu cheyalsinavi chesthune untaru@iamnagarjuna @amalaakkineni1 visited #TTD for the blessing of Swamy to shower on #Agent and #Custody@AkhilAkkineni8 @chay_akkineni #Nagarjuna 👑👑👑 pic.twitter.com/pexuKZm4gd
— Nag Mama Rocks 🤙🔥👑😎🌟🫶⛓️🇮🇳 (@SravanPk4) April 26, 2023