Bigg Boss 5: హౌస్‌లో ఏం జరుగుతుంది.. సిరి, షణ్ముఖ్‌లను కడిగేసిన నాగ్!

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో చివరి దశకి వచ్చేస్తుంది. ఇప్పటికే పది వారాలు పూర్తి కాగా 11వ వారం చివరి దశకి వచ్చేసింది. ఇప్పటికే 10 మంది కంటెస్టెంట్లు బయటకి వచ్చేయగా ఈ వారం మరో..

Bigg Boss 5: హౌస్‌లో ఏం జరుగుతుంది.. సిరి, షణ్ముఖ్‌లను కడిగేసిన నాగ్!

Bigg Boss 5

Bigg Boss 5: తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో చివరి దశకి వచ్చేస్తుంది. ఇప్పటికే పది వారాలు పూర్తి కాగా 11వ వారం చివరి దశకి వచ్చేసింది. ఇప్పటికే 10 మంది కంటెస్టెంట్లు బయటకి వచ్చేయగా ఈ వారం మరో కంటెస్టెంట్ బయటకి రావాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ వారంలో ఒక్క రవి మినహా మిగతా అందరూ ఎలిమినేషన్ లో నామినేషన్ అయి ఉండగా ఎవరు ఎలిమినేషన్ అవుతారా అన్న ఉత్కంఠ మొదలైంది. వీకెండ్ అనగానే కనిపించే పర్సనాలిటీ హోస్ట్ నాగ్.

Sidhika Sharma: సిద్ధికా ఈజ్ వెరీ హాట్ స్వీట్!

ఈ వారం కూడా నాగ్ కాస్త చిలిపిగా మరికాస్త ఆవేశంగా కనిపిస్తూ సందడి చేశాడు. ఇప్పటికే విడుదలైన ప్రోమోలను బట్టి చూస్తే నాగ్ కంటెస్టెంట్లు సిరి, షణ్ముఖ్ లను కడిగేశాడు. ఈ మధ్య హౌస్ లో ఈ ఇద్దరి ప్రవర్తనపై ప్రేక్షకుల నుండి తీవ్రంగా ట్రోలింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఫ్రెండ్స్ అంటూనే హగ్గులు, ముద్దులు శృతి మించడం.. ఎవరికి వారు వారి ప్రేమికులను గుర్తు చేసుకుంటూనే ఈ ఇద్దరూ బెడ్ రూమ్ లో అతుక్కొని పడుకోడం చాలా వ్యవహారమే నడిపిస్తున్నారు.

Aditi Rao Hydari: లేలేత అందాలతో అదరగొడుతున్న అదితి!

దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన నాగ్ ఎవరికి వారిని కన్ఫెషన్ రూమ్ కి పిలిపించి మాట్లాడాడు. ముందుగా సిరిని హౌస్ లో ఏం జరుగుతుందని.. నీ పరిస్థితి ఏంటో నీకైనా తెలుస్తుందా అని ప్రశ్నించాడు. దానికి సిరి అన్నీ తెలిసినా ఎందుకో కనెక్ట్ అయిపోతున్నా అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఇక షణ్ముఖ్ ను కూడా అదే రేంజిలో నాగ్ ప్రశ్నించాడు. దీప్తిని మిస్ అవుతున్నావా అని షణ్ముఖ్ ను నాగ్ ప్రశ్నించడంతో చాలా అని సమాధానమిచ్చాడు. దీంతో ఇంటి గేట్స్ ఓపెన్ చేయమని నాగ్ ఆర్డర్ ఇవ్వడం గేట్స్ తెరుచుకున్నాయి. దీప్తిని మిస్సవుతున్నట్లైతే షణ్ముఖ్ ఇంటి నుండి బయటకి వెళ్లిపోవచ్చని నాగ్ గట్టిగా చెప్పేశాడు. మరి ఈరోజు ఎపిసోడ్ ఏం జరిగిందన్నది చూడాలి.