Brahmāstra: ఎట్టకేలకు నాగ్-రణబీర్ సినిమా విడుదల వచ్చేసింది!

టాలీవుడ్ కింగ్, మన్మధుడు నాగార్జున ప్రస్తుతం నటించే బ్రహ్మాస్త్ర సినిమా గురించి నిన్న మొన్నటి వరకు ఎలాంటి అప్డేట్ లేదు. రెండేళ్ల క్రితం కరోనాకు ముందు ఈ సినిమా కొంతమేర షూటింగ్..

Brahmāstra: ఎట్టకేలకు నాగ్-రణబీర్ సినిమా విడుదల వచ్చేసింది!

Brahmāstra

Brahmāstra: టాలీవుడ్ కింగ్, మన్మధుడు నాగార్జున ప్రస్తుతం నటించే బ్రహ్మాస్త్ర సినిమా గురించి నిన్న మొన్నటి వరకు ఎలాంటి అప్డేట్ లేదు. రెండేళ్ల క్రితం కరోనాకు ముందు ఈ సినిమా కొంతమేర షూటింగ్ జరిగి ఆగిపోగా.. కరోనా తర్వాత ఈ సినిమా గురించి ఎక్కడా ఎలాంటి అప్డేట్ లేకుండాపోయింది. రణబీర్ కపూర్, అలియా భట్, నాగార్జున ప్రధాన తారాగణంగా తెరకెక్కాల్సిన ఈ బాలీవుడ్ సినిమా గురించి ఈ మధ్యే కదలిక రాగా త్వరలోనే మళ్ళీ షూటింగ్ షెడ్యూల్ కూడా ప్లాన్ చేశారు.

Telugu Folk Songs: ట్రెండ్ మారింది.. ఫోక్ మీద ఫోకస్ పెరిగింది!

కాగా, ఇప్పుడు ఈ సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించేశారు మేకర్స్. 2022 సెప్టెంబ‌ర్ 9న థియేట‌ర్ల‌లో గ్రాండ్‌గా విడుద‌ల కాబోతుంది బ్ర‌హ్మాస్త్ర‌. అయాన్ ముఖ‌ర్జీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాలో ర‌ణబీర్ క‌పూర్‌, అలియాభ‌ట్‌, అమితాబ్ బ‌చ్చ‌న్, మౌనీరాయ్‌ సహా అక్కినేని నాగార్జున ముఖ్యపాత్రలో నటిస్తున్నాడు. నిజానికి ఇది నాగ్ కు చాలా గ్యాప్ త‌ర్వాత బాలీవుడ్ రీ ఎంట్రీ. అంతకు ముందు వరస బాలీవుడ్ సినిమాలను చేసిన నాగ్ చాలాకాలంగా స్ట్రైట్ హిందీ సినిమాలేవీ చేయలేదు.

Pragathi: ‘నాగిని’ పాటకు ప్రగతి ఇరగదీసే స్టెప్పులు.. వీడియో వైరల్‌

అయితే, బ్రహ్మాస్త్ర యూనివర్సల్ సబ్జెక్టు కావడం.. హిందీతోపాటు తెలుగు, త‌మిళం, బెంగాలీ, మ‌ల‌యాళ భాష‌ల్లో విడుద‌ల కానుండడంతో సౌత్ నుండి నాగ్ ఒక్కడే కనిపించనుండడం వంటి కారణాలతో మళ్ళీ బాలీవుడ్ సినిమాకి ఒకే చెప్పాడు. ఫాక్స్ స్టార్ స్టూడియోస్, ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ల‌పై క‌ర‌ణ్ జోహార్‌, ర‌ణ్ బీర్ క‌పూర్‌, అయాన్ ముఖ‌ర్జీ, అపూర్వ మెహ‌తా, న‌మిత్ మ‌ల్హోత్రా వంటి బడా నిర్మాతలు ఈ సినిమా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి.