30 ఏళ్ల ‘బాల గోపాలుడు’

నందమూరి బాలకృష్ణ, సుహాసిని జంటగా.. పి.బి.ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై, కోడి రామకృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.. ‘బాల గోపాలుడు’.. . 2019 అక్టోబర్ 13 నాటికి 30 ఏళ్లు పూర్తి చేసుకుంటోంది..

  • Published By: sekhar ,Published On : October 12, 2019 / 11:13 AM IST
30 ఏళ్ల ‘బాల గోపాలుడు’

నందమూరి బాలకృష్ణ, సుహాసిని జంటగా.. పి.బి.ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై, కోడి రామకృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.. ‘బాల గోపాలుడు’.. . 2019 అక్టోబర్ 13 నాటికి 30 ఏళ్లు పూర్తి చేసుకుంటోంది..

నందమూరి బాలకృష్ణ, సుహాసిని జంటగా.. పి.బి.ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై, కోడి రామకృష్ణ దర్శకత్వంలో, ఎమ్ఆర్‌వి ప్రసాద్ (బాలకృష్ణ తోడల్లుడు) నిర్మించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.. ‘బాల గోపాలుడు’.. ఆబాల గోపాలాన్నీ, ముఖ్యంగా మహిళా ప్రేక్షకులను అలరించిన ‘బాల గోపాలుడు’ 1989 అక్టోబర్ 13న విడుదలైంది. 2019 అక్టోబర్ 13 నాటికి  ‘బాల గోపాలుడు’ 30 ఏళ్లు పూర్తి చేసుకుంటోంది.

నందమూరి కళ్యాణ్ రామ్, రాశి ఈ సినిమాతో బాల నటులుగా వెండితెరకు పరిచయమై, తమ నటనతో ఆకట్టుకున్నారు. ఇక బాలయ్య బంగారు మువ్వ బాల గోపాలంగా,కల్మషం తెలియని పల్లెటూరి యువకుడిగా అదరగొట్టేశాడు. రేఖగా సుహాసిని, నరసింహగా రావుగోపాలరావు, లింగయ్యగా అల్లు రామలింగయ్య, చంద్రశేఖర రావుగా జగ్గయ్య తదితరులు నటించారు. గిరిబాబు, మోహన్ బాబు, మల్లిఖార్జున రావు ఇతర పాత్రలు చేశారు. రాజ్-కోటి సంగీతం సినిమాకు ప్లస్ అయ్యింది.

Read Also : అభిమానుల సమక్షంలో ‘అరవింద సమేత’ 1 ఇయర్ సెలబ్రేషన్స్!

పాటల్లో బాలయ్య డ్యాన్స్‌లు ఇరగదీసేశాడు. చలనచిత్ర చరిత్రలో విడుదలకు ముందే పాటలకు ‘గోల్డ్ డిస్క్’ పొందిన మొదటి చిత్రంగా ఈ సినిమా రికార్డ్ క్రియేట్ చేసింది. ‘బాల గోపాలుడు’ విడుదలై 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆనాటి జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటూ.. సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు బాలయ్య అభిమానులు..