Amigos: ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌ను లాక్ చేసుకున్న కళ్యాణ్ రామ్ ‘అమిగోస్’

నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన రీసెంట్ మూవీ ‘అమిగోస్’ రిలీజ్‌కు ముందు మంచి అంచనాలు క్రియేట్ చేసింది. కళ్యాణ్ రామ్ ట్రిపుల్ రోల్‌లో నటిస్తుండటంతో ఈ సినిమాలో ఆయన పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ఇక ఈ సినిమా టీజర్, ట్రైలర్లు ఆకట్టుకునే విధంగా ఉండటం.. సినిమాలో బాలకృష్ణ ఎవర్‌గ్రీన్ రొమాంటిక్ సాంగ్ ‘ఎన్నో రాత్రులొస్తాయి గానీ’ వంటి రీమిక్స్ సాంగ్ ఉండటంతో ఈ సినిమాపై అంచనాలు బాగానే క్రియేట్ అయ్యాయి.

Amigos: ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌ను లాక్ చేసుకున్న కళ్యాణ్ రామ్ ‘అమిగోస్’

Nandamuri Kalyan Ram Amigos Locks OTT Streaming Date

Amigos: నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన రీసెంట్ మూవీ ‘అమిగోస్’ రిలీజ్‌కు ముందు మంచి అంచనాలు క్రియేట్ చేసింది. కళ్యాణ్ రామ్ ట్రిపుల్ రోల్‌లో నటిస్తుండటంతో ఈ సినిమాలో ఆయన పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ఇక ఈ సినిమా టీజర్, ట్రైలర్లు ఆకట్టుకునే విధంగా ఉండటం.. సినిమాలో బాలకృష్ణ ఎవర్‌గ్రీన్ రొమాంటిక్ సాంగ్ ‘ఎన్నో రాత్రులొస్తాయి గానీ’ వంటి రీమిక్స్ సాంగ్ ఉండటంతో ఈ సినిమాపై అంచనాలు బాగానే క్రియేట్ అయ్యాయి.

Amigos: కళ్యాణ్ రామ్ ‘అమిగోస్’ మూవీ శాటిలైట్ రైట్స్ దక్కించుకున్న జెమిని

దీనికితోడు ఈ సినిమాను ప్రమోట్ చేసేందుకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా రావడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడం ఖాయమని అందరూ అనుకున్నారు. కట్ చేస్తే.. సినిమా రిలీజ్ రోజునే మిక్సిడ్ టాక్‌ను సొంతం చేసుకుంది. సినిమా కథలో ఆకట్టుకునే అంశాలు పెద్దగా లేకపోవడంతో ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు ఆసక్తి చూపలేదు. దీంతో ఈ సినిమా అనుకున్న స్థాయిలో రెస్పాన్స్‌ను అందుకోలేకపోయింది. ఫలితంగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది.

Amigos: కళ్యాణ్ రామ్ అమిగోస్ చిత్రాన్ని ఈ హీరోలు రిజెక్ట్ చేశారా..?

ఇక ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. దీంతో అమిగోస్ చిత్రాన్ని ఏప్రిల్ 1న ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేందుకు నెట్‌ఫ్లిక్స్ రెడీ అయినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలో అందాల భామ అషికా రంగనాథ్ హీరోయిన్‌గా నటించగా, మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశారు. రాజేంద్ర రెడ్డి డైరెక్ట్ చేసిన అమిగోస్ చిత్రానికి ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో చూడాలి.