Nani : నాని ‘అంటే సుందరానికి’ నుంచి బర్త్‌డే హోమం పేరుతో స్పెషల్ వీడియో

తాజాగా రేపు నాని పుట్టిన రోజు సందర్భంగా ఇవాళ 'అంటే సుందరానికి' టీజర్ ని రిలీజ్ చేశారు. ఈ టీజర్ లో నాని పుట్టిన రోజు సందర్భంగా ఇంట్లో పూజలు, హోమాలు చేపించినట్లు చూపించారు..........

Nani : నాని ‘అంటే సుందరానికి’ నుంచి బర్త్‌డే హోమం పేరుతో స్పెషల్ వీడియో

Nani

Nani : న్యాచురల్ స్టార్ నాని ఇటీవలే ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాతో మంచి విజయం సాధించి ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ప్రస్తుతం నాని వరుస సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే నాని చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. ఇటీవలే నాని నెక్స్ట్ సినిమా ‘అంటే సుందరానికి’ షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది ఈ సినిమా. తాజాగా రేపు నాని పుట్టిన రోజు సందర్భంగా ఇవాళ ‘అంటే సుందరానికి’ సినిమా నుంచి బర్త్‌డే హోమం పేరుతో స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు.

ఈ వీడియోలో నాని పుట్టిన రోజు సందర్భంగా ఇంట్లో పూజలు, హోమాలు చేపించినట్లు చూపించారు. చిన్నప్పటి నుంచి నానికి రకరకాల గండాలున్నాయని, వాటి కోసం పూజలని చూపించారు. నాని వీటిని తిట్టుకుంటున్నట్టు టీజర్ ఆద్యంతం కామెడీగా చూపించారు. ఇందులో నానికి అమ్మగా సీనియర్ నటి రోహిణి, నాన్నగా సీనియర్ నటుడు నరేష్ కనిపించబోతున్నారు. ఈ వీడియో వీడియో ప్రస్తుతం యూట్యూబ్‌ ట్రెండింగ్‌లో ఉంది.

Pawan Kalyan : ‘భీమ్లా నాయక్’ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతో తెలుసా??

నానికి జంటగా ఇందులో నజ్రీయా నటించింది. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ సినిమాని తెరకెక్కిస్తోంది. సినిమా రిలీజ్ డేట్ ని కూడా ఈ వీడియోతో పాటు అనౌన్స్ చేశారు. జూన్ 10వ తేదీన ‘అంటే సుందరానికి’ సినిమా రిలీజ్ అవ్వనుంది.