నరకాసురుడు-డబ్బింగ్ చెప్తున్నాడు

నరకాసురుడు షూటింగ్ పూర్తి..

  • Published By: sekhar ,Published On : February 18, 2019 / 12:43 PM IST
నరకాసురుడు-డబ్బింగ్ చెప్తున్నాడు

నరకాసురుడు షూటింగ్ పూర్తి..

అరవింద్ స్వామి.. చాలా కాలం గ్యాప్ తర్వాత ధృవ, నవాబ్ సినిమాలతో తెలుగు ఆడియన్స్‌ని ఆకట్టుకున్నాడు. ఇప్పుడు అరవింద్ స్వామి, శ్రియ, సందీప్ కిషన్ మెయిన్ లీడ్స్‌గా తమిళ్‌లో  నరగాసురన్.. అనే సినిమా రూపొందుతుంది. ఈ సినిమా తెలుగులో నరకాసురుడు పేరుతో రిలీజ్ కానుంది. ‘ది టేల్ ఆఫ్ ఎ ఫాలెన్ డెమాన్’.. అనేది ట్యాగ్ లైన్.. రీసెంట్‌గా రిలీజ్ చేసిన ఫస్ట్‌లుక్‌కి రెస్పాన్స్ బాగుందని నిర్మాత చెప్తున్నారు. ఈ సినిమాని కార్తీక్ నరేన్ డైరెక్ట్ చేస్తున్నాడు. థ్రిల్లింగ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న నరకాసురుడు షూటింగ్ పూర్తయ్యింది.

పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయ్యింది. ప్రస్తుతం డబ్బింగ్ జరుగుతుంది. త్వరలో రిలీజ్ డేట్ అనౌన్స్ చెయ్యనున్నారు. ఈ సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : మణికందన్, మ్యూజిక్ : రాన్ ఏతాన్ య ఓహాన్.