Narappa: ఎనీ సెంటర్.. సింగిల్ డే.. అంటోన్న నారప్ప!

కరోనా కాలంలో థియేటర్లు మూతపడటంతో జనాలకు ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే ఆ సమయంలో వారిని ఓటీటీలు ఎంతలా ఎంటర్‌టైన్ చేశాయో అందరికీ తెలిసిందే. ఇక ఈ ఓటీటీల విజృంభన కూడా కరోనా సమయంలోనే జరిగిందని చెప్పాలి. ఆ సమయంలో పలు సినిమాలు, వెబ్ సిరీస్‌లు ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ అయ్యాయి. అలాంటి వాటిలో తెలుగు స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన ‘నారప్ప’ కూడా ఒకటి.

Narappa: ఎనీ సెంటర్.. సింగిల్ డే.. అంటోన్న నారప్ప!

Narappa To Release In Theatres On Dec 13 For One Day

Narappa: కరోనా కాలంలో థియేటర్లు మూతపడటంతో జనాలకు ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే ఆ సమయంలో వారిని ఓటీటీలు ఎంతలా ఎంటర్‌టైన్ చేశాయో అందరికీ తెలిసిందే. ఇక ఈ ఓటీటీల విజృంభన కూడా కరోనా సమయంలోనే జరిగిందని చెప్పాలి. ఆ సమయంలో పలు సినిమాలు, వెబ్ సిరీస్‌లు ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ అయ్యాయి. అలాంటి వాటిలో తెలుగు స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన ‘నారప్ప’ కూడా ఒకటి.

Narappa : మాస్క్ పెట్టుకోమన్న పోలీసులు.. సినిమా చూడండంటున్న సురేష్ ప్రొడక్షన్స్..

తమిళ హీరో ధనుష్ నటించిన ‘అసరున్’కు తెలుగు రీమేక్‌గా వచ్చిన ఈ సినిమా నేరుగా ఓటీటీలో రిలీజ్ అయ్యింది. అయితే ఈ సినిమా నేరుగా ఓటీటీలో రావడంతో అనుకున్న స్థాయిలో రెస్పాన్స్ దక్కలేదని చిత్ర యూనిట్ భావించింది. ఇక ఈ సినిమాలో వెంకటేష్ సరసన ప్రియమణి హీరోయిన్‌గా నటించింది. అయితే ఇప్పుడు మరోసారి నారప్ప సినిమా వార్తల్లో నిలిచింది. ఈ సినిమాను ఇప్పుడు థియేట్రికల్ రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు. ఓటీటీలో వచ్చిన సినిమాను ఇప్పటికే చాలా మంది చూసుంటారు.. మరి ఇప్పుడు థియేటర్స్‌లో రిలీజ్ చేయడం ఏమిటని అనుకుంటున్నారా.. అయితే ఈ సినిమాను కేవలం ఒక్క రోజుకే థియేటర్స్‌లో రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.

Narappa : వెంకటేష్ కనబడలేదు. ‘నారప్పే’ కనిపించాడు – చిరంజీవి..

విక్టరీ వెంకటేష్ పుట్టినరోజైన డిసెంబర్ 13న నారప్ప సినిమాను థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. అప్పట్లో ఎనీ సెంటర్.. సింగిల్ హ్యాండ్.. అని వెంకటేష్ చెప్పిన డైలాగ్‌ను ఇప్పుడు.. ఎనీ సెంటర్.. సింగిల్ డే.. అని నారప్ప చెప్పడం ఖాయమని వెంకీ అభిమానులు అంటున్నారు. ఏదేమైనా ప్రస్తుతం సినిమాలను రీ-రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో, ఇలా ఓటీటీలో వచ్చిన సినిమాను కూడా థియేటర్లలో రిలీజ్ చేయడం కేవలం వెంకీకే చెందిన రికార్డుగా ఆయన అభిమానులు పేర్కొంటున్నారు.