Navadeep : గడ్డం తెల్లబడితే చేయాల్సింది ట్రిమ్మింగ్.. పెళ్లి కాదు.. పెళ్ళికి నో అంటున్న నవదీప్

పెళ్లి చేసుకోమ‌ని స‌ల‌హాలిస్తున్న వారంద‌రికీ ఓ వీడియో పోస్ట్ చేసి కౌంట‌ర్ ఇచ్చాడు. తాజాగా ఒద్దురా సోద‌రా... అంటూ ఓ వీడియో పోస్ట్ చేసాడు నవదీప్. ఆ వీడియోలో... “అన్నా నీ గ‌డ్డం.....

Navadeep : గడ్డం తెల్లబడితే చేయాల్సింది ట్రిమ్మింగ్.. పెళ్లి కాదు.. పెళ్ళికి నో అంటున్న నవదీప్

Navadeep

Navadeep :  టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్స్‌లో న‌వ‌దీప్ ఒక‌డు. 2004లో తేజ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ‘జై’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నవదీప్ ఆ తర్వాత హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, సెకండ్ హీరోగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఆ తర్వాత బుల్లితెరపై యాంకర్ గా, జడ్జిగా కూడా మెప్పించాడు. ఇప్పుడు ఓటీటీలో వెబ్ సిరీస్ లు కూడా చేస్తూ బిజీబిజీగా ఉన్నాడు నవదీప్.

 

ఇప్పటికే 35 ఏళ్ళు ఉన్న న‌వ‌దీప్‌ పెళ్లి మాట ఎత్తితే నో అంటున్నాడు. ఇప్పటికే చాలా ఇంటర్వ్యూలలో, చాలా షోలలో పెళ్లి చేసుకొని అని చెప్తూనే వస్తున్నాడు. పెళ్లి వద్దు అంటూ అప్పుడప్పుడు తన సోషల్ మీడియాలో కొటేషన్స్ కూడా పెడుతూ ఉంటాడు. అయితే చాలా మంది నెటిజన్స్, ఫ్యాన్స్ నవదీప్ కి పెళ్లి చేసుకోమని కామెంట్స్ , మెసేజెస్ చేస్తున్నారంట. రోజూ ఇలా చాలా మంది నవదీప్ ని ఏజ్ అయిపోతుంది పెళ్లి చేసుకో అని చెప్తున్నారంట.

Chiranjeevi : బెంగాలీ సినిమాని ప్రమోట్ చేసిన మెగాస్టార్

దీంతో ఇవన్నీ వినీ వినీ నవదీప్ కి చిరాకొచ్చి పెళ్లి చేసుకోమ‌ని స‌ల‌హాలిస్తున్న వారంద‌రికీ ఓ వీడియో పోస్ట్ చేసి కౌంట‌ర్ ఇచ్చాడు. తాజాగా ఒద్దురా సోద‌రా… అంటూ ఓ వీడియో పోస్ట్ చేసాడు నవదీప్. ఆ వీడియోలో… “అన్నా నీ గ‌డ్డం తెల్ల‌బ‌డుతోంది తొంద‌ర‌గా పెండ్లి చేసుకో అని నాకు కొంత‌మంది స‌ల‌హాలిస్తున్నారు. గ‌డ్డం తెల్ల‌బ‌డితే చేసుకోవాల్సింది ట్రిమ్మింగ్‌.. పెండ్లి కాదు. దుర‌ద పుడితే గోక్కుంటాం కానీ తోలు పీకేసుకోం క‌దా” అంటూ కౌంట‌రిచ్చాడు. దీంతో నవదీప్ ఇలాగే పెళ్లి చేసుకోకుండా ఉండిపోతాడా అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.