రెండు నెట్ ఫ్లిక్స్ సినిమాలకే అవార్డులు

  • Published By: vamsi ,Published On : February 10, 2020 / 06:02 AM IST
రెండు నెట్ ఫ్లిక్స్ సినిమాలకే అవార్డులు

ఆస్కార్ అవార్డు…  అకాడమీ అవార్డు.. పేరు ఏదైనా ప్రపంచంలోనే ప్రఖ్యాత అవార్డు.. సినిమా ఇండస్ట్రీలో ఉండే ప్రతి ఒక్కరు ఒక్కసారైనా అందుకోవాలని భావించే అవార్డు. అయితే ఆస్కార్‌కి నామినేట్ కావాలంటే ఏ సినిమా అయిన అంతర్జాతీయ ప్రమాణాలతో పోటీ పడేలా ఉండాలి. వెండితెరపై భారీ వసూళ్లు సాధించి ప్రేక్షకుల మనసులు దోచుకునేలా ఉన్నంత మాత్రాన ఆస్కార్ బరిలోకి రాలేవు.

అలాంటి ఆస్కార్ వేదిక మీద డిజిటల్ మాధ్యమమైన నెట్ ఫ్లిక్ తన హవా చూపించింది. 2020 అకాడమీ చిత్రాల్లో 24 విభాగాల్లో నెట్ ఫ్లిక్స్ సినిమాలు నామినేషన్స్ దక్కించుకున్నాయి. అయితే అందులో చివరకు రెండు సినిమాలు మాత్రమే ఆస్కార్ అవార్డులు దక్కించుకున్నాయి. 

ఆస్కార్ నామినేషన్స్‌లో ‘ది ఐరిష్ మ్యాన్’ ఒక్కటే ఎక్కువగా 10 నామినేషన్లు సొంత చేసుకోగా.. ఒక్క అవార్డు కూడా దక్కించుకోలేదు. అయితే  నెట్ ఫ్లిక్స్ నుంచి “అమెరికన్ ఫ్యాక్టరీ” మాత్రం ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ అవార్డును గెలుచుకుంది. ఈ చిత్రం బరాక్ మరియు మిచెల్ ఒబామా నెట్‌ఫ్లిక్స్‌తో నిర్మించారు. ఇక నెట్‌ఫ్లిక్స్ నుంచి వచ్చిన “మ్యారేజ్ స్టోరీ”కి అవార్డులు భారీగా రావచ్చునననే ప్రచారం సాగింది. మ్యారేజ్ స్టోరీ ఆరు ఆస్కార్‌లకు నామినేట్ అవగా.. అందులో సహాయ నటిగా లారా డెర్న్‌కు మాత్రమే అవార్డు అభించింది. 

గతేడాది నెట్‌ఫ్లిక్స్ “రోమా” సినిమాటోగ్రఫీ, విదేశీ భాషా చిత్రం మరియు దర్శకుడికి అవార్డులను దక్కించుకుంది.