Ashu Reddy: అషుకి లైవ్‌లో ఫోన్ నెంబర్ ఇచ్చిన నెటిజన్.. తర్వాత ఏమైందంటే?
దాదాపు ఐదారేళ్ల క్రితమే అమెరికా నుండి ఇండియాలో దిగిపోయిన అషు రెడ్డి.. ఈ షో.. ఆ షో అని లేకుండా.. ఈవెంట్లు.. స్టేజి షోలలో బాగానే సందడి చేస్తూ దూసుకుపోతోంది. అద్భుతమైన గ్లామర్..

Ashu Reddy
Ashu Reddy: దాదాపు ఐదారేళ్ల క్రితమే అమెరికా నుండి ఇండియాలో దిగిపోయిన అషు రెడ్డి.. ఈ షో.. ఆ షో అని లేకుండా.. ఈవెంట్లు.. స్టేజి షోలలో బాగానే సందడి చేస్తూ దూసుకుపోతోంది. అద్భుతమైన గ్లామర్.. అసలే అమెరికా నుండి దిగుమతి కావడంతో పెద్దగా హద్దులు లేవు. ఇంకా చెప్పాలంటే అందాలను అసలు దాచుకోదు. కానీ.. ఎందుకో పెద్ద అవకాశాలేమీ పట్టలేకపోతుంది. ఒకటికి మూడు ఛానెళ్లలో కామెడీ షోలలో సందడి చేస్తున్న అషు.. ఆ మధ్య దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూతో మరింత హైలెట్ అయింది.
Sarkaru Vaari Paata: ముహూర్తం పెట్టేసిన మహేశ్.. వాలంటైన్స్ డే రోజున ఫస్ట్ సింగిల్
సోషల్ మీడియాలో ఎక్కువగా హల్చల్ చేసే అషు వరసగా ఫోటో షూట్లు చేసి వదులుతుంది. ముఖ్యంగా స్కర్ట్స్ లో ఎక్కువగా ఫోటో షూట్లు చేసే అషు తన బలం ఏంటో.. తన అందానికి అసెట్ ఏంటో తెలిసే అలా స్కర్ట్స్ లో ఫోటో షూట్లు చేస్తుంది. ఇక అప్పుడప్పుడు షోషల్ మీడియా ఖాతాల నుండి లైవ్ లోకి వచ్చే అషు నెటిజన్లతో పిచ్చా పాటి చాట్ చేస్తుంది. అప్పుడప్పుడు లైవ్ నెటిజన్ల నుండి ఇబ్బందులు కూడా ఎదుర్కొంటుంది అషు.
Shikaru: వరుణ్ తేజ్ ఆవిష్కరించిన పాట.. సిద్ శ్రీరామ్ మరో లవ్ సాంగ్!
సాధారణంగా లైవ్‌లోకి వచ్చిన సెలబ్రెటీలను నెటిజన్లు వారి ఫోన్ నెంబర్ అడిగి ఇబ్బంది పెడుతుంటారు. కానీ ఇక్కడ ఓ నెటిజన్ తెలివిగా ప్రవర్తించాడు. అషు నెంబర్ అడగకుండా.. ఓ నెటిజన్ తన ఫోన్ నెంబర్ ఇచ్చాడు. అంతేకాదు నీతో మాట్లాడాలని ఉంది అక్క.. ఫోన్ చేయ్ అని చెప్పాడు. అయితే ఈ ఫోటోలను అషు తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేసింది. దీంతో ఈ పోస్ట్‌లో నెంబర్ చూసిన ఆమె ఫ్యాన్స్ ఆ నెంబర్‌కి కాల్ చేస్తున్నారట. దెబ్బకి దిగొచ్చిన నెటిజన్ ప్లీజ్ అక్క ఆ పోస్ట్ డెలిట్ చేయ్ అంటూ దండం పెట్టి వేడుకున్నాడు. ఇందుకు అషూ కూల్ గా ఎంజాయ్ చేయ్ రిప్లై ఇచ్చింది.