Nikhil: కార్తికేయ-2 ఎఫెక్ట్.. భారీగా పెంచేసిన నిఖిల్!

టాలీవుడ్‌లో కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు చేసే హీరోగా యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇక ఈ హీరో నటించిన రీసెంట్ బ్లాక్‌బస్టర్ మూవీ ‘కార్తికేయ-2’ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. తెలుగు సినిమాగా వచ్చిన ‘కార్తికేయ-2’ను హిందీలోనూ డబ్ చేసి రిలీజ్ చేయగా, అక్కడ ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఫలితంగా ఈ సినిమా ఏకంగా రూ.100 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టి ఔరా అనిపించింది.

Nikhil: కార్తికేయ-2 ఎఫెక్ట్.. భారీగా పెంచేసిన నిఖిల్!

Nikhil Siddharth Hikes Remuneration After Karthikeya 2 Success

Nikhil: టాలీవుడ్‌లో కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు చేసే హీరోగా యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇక ఈ హీరో నటించిన రీసెంట్ బ్లాక్‌బస్టర్ మూవీ ‘కార్తికేయ-2’ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. తెలుగు సినిమాగా వచ్చిన ‘కార్తికేయ-2’ను హిందీలోనూ డబ్ చేసి రిలీజ్ చేయగా, అక్కడ ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఫలితంగా ఈ సినిమా ఏకంగా రూ.100 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టి ఔరా అనిపించింది.

Nikhil : మనకి ఆస్కార్ ఎందుకు.. నిఖిల్ సంచలన కామెంట్స్..

ఇక ఈ సినిమా ఇచ్చిన బూస్ట్‌తో నిఖిల్ ప్రస్తుతం తన నెక్ట్స్ మూవీని రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ‘18 పేజెస్’ అనే ఓ బ్యూటీఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు ఈ యంగ్ హీరో. అయితే కార్తికేయ-2తో భారీ విజయాన్ని అందుకున్న నిఖిల్, ప్రస్తుతం తన రెమ్యునరేషన్‌ను అమాంతం పెంచేసినట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో ఒక్కో సినిమాకు రూ.4 కోట్ల నుంచి రూ.5 కోట్లు వసూలు చేసిన నిఖిల్, ఇప్పుడు కార్తికేయ-2 సినిమా సక్కెస్ తరువాత తన రెమ్యునరేషన్‌ను అమాంతం రు.8 కోట్లకు పెంచినట్లుగా తెలుస్తోంది.

Nikhil : కార్తికేయ 2 సినిమా.. త్వరలో ఆ లాంగ్వేజ్ లో కూడా రిలీజ్..

నిఖిల్ ప్రస్తుతం సైన్ చేస్తున్న సినిమాలకు రూ.8 కోట్ల మేర రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లుగా చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇక ఈ హీరో నటించిన తాజా మూవీ ‘18 పేజెస్’ డిసెంబర్ 23న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌కు రెడీగా ఉండగా, ఈ సినిమాలో అందాల భామ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను పల్నాటి సూర్యప్రతాప్ డైరెక్ట్ చేయగా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది.