Nikhil Siddhartha : కార్తికేయ 2తో నేషనల్ లెవల్లో మరో అవార్డు అందుకున్న నిఖిల్
కార్తికేయ 2 సినిమాతో నిఖిల్ కలెక్షన్స్ తో పాటు మంచి పేరు కూడా సంపాదించుకున్నాడు. ఇప్పుడు నేషనల్ వైడ్ లో అవార్డులు కూడా సాధిస్తున్నాడు. ఇప్పటికే ఐకానిక్ గోల్డ్ అవార్డ్స్ లో బెస్ట్ యాక్టర్ పాపులర్ ఛాయస్ అవార్డుని అందుకున్నాడు......................

Nikhil Siddhartha winning another award in national level by OTT Play for Karthikeya 2
Nikhil Siddhartha : నిఖిల్, అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) జంటగా చందూ మొండేటి దర్శకత్వంలో వచ్చిన సినిమా కార్తికేయ 2(Karthikeya 2). గతంలో వచ్చిన కార్తికేయ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా చిన్న సినిమాగా రిలీజయి పాన్ ఇండియా లెవల్లో భారీ విజయం సాధించింది. ఏకంగా 100 కోట్లు కలెక్ట్ చేసి అందరిని ఆశ్చర్యపరిచింది కార్తికేయ 2. నిఖిల్ లాంటి టైర్ 2 హీరో కార్తికేయ 2 సినిమాతో 100 కోట్లు సాధించి బిగ్ హిట్ కొట్టడంతో నిఖిల్ కి కూడా ఇండియా వైడ్ పాపులారిటీ వచ్చింది.
కార్తికేయ 2 సినిమాతో నిఖిల్ కలెక్షన్స్ తో పాటు మంచి పేరు కూడా సంపాదించుకున్నాడు. ఇప్పుడు నేషనల్ వైడ్ లో అవార్డులు కూడా సాధిస్తున్నాడు. ఇప్పటికే ఐకానిక్ గోల్డ్ అవార్డ్స్ లో బెస్ట్ యాక్టర్ పాపులర్ ఛాయస్ అవార్డుని అందుకున్నాడు. దీంతో పాటు ఇదే ఐకానిక్ గోల్డ్ అవార్డ్స్ లో కార్తికేయ సినిమాకు మరో రెండు అవార్డులు కూడా వచ్చాయి. తాజాగా నిఖిల్ కార్తికేయ 2 సినిమాకు గాను నేషనల్ లెవల్ లో మరో అవార్డుని అందుకున్నాడు.
OTT ప్లే అనే సంస్థ అందిస్తున్న ఛాలెంజ్ మేకర్ అవార్డుల్లో Trailblazer of the Year అనే అవార్డు కార్తికేయ 2 సినిమాకు గాను నిఖిల్ సిద్దార్థ్ గెలుచుకున్నాడు. దీంతో ఆ అవార్డుతో నిఖిల్ ఫొటో ప్రస్తుతం వైరల్ గా మారగా అభిమానులు, నెటిజన్లు నిఖిల్ కు కంగ్రాట్స్ చెప్తున్నారు.
A round of applause for @actor_Nikhil! Congratulations on your big win as the 'Trailblazer of the Year'. You are truly a shining star.🌟
.
Real Fruit Juices & Beverage Presents #OTTplayChangeMakers Awards 2023 @Realjuices pic.twitter.com/WBHNxKXQNg— OTTplay (@ottplayapp) March 29, 2023
Actor Nikhil Siddhartha wins yet another National Honour for #Karthikeya2. Nikhil has been conferred with ‘Trailblazer of the Year’ at Hindustan Times group’s OTT Play Changemaker Awards 2023. @actor_Nikhil #NikhilSiddhartha pic.twitter.com/caVNSwtwwX
— Shreyas Media (@shreyasgroup) March 30, 2023