పెళ్లి పనులు ప్రారంభం!

  • Published By: sekhar ,Published On : July 1, 2020 / 11:45 AM IST
పెళ్లి పనులు ప్రారంభం!

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ పెళ్లి తేది ఖ‌రారైంద‌నే వార్త ఒకటి సోష‌ల్ మీడియాలో బాగా వినిపిస్తోంది. నితిన్, షాలిని కందుకూరిల పెళ్లి ఏప్రిల్ 16నే జరగాల్సింది. కానీ క‌రోనా కారణంగా పెళ్లిని వాయిదా వేశారు. ఆ త‌ర్వాత వీరి పెళ్లి డిసెంబ‌ర్‌లో జ‌రుగుతుంద‌ని వార్త‌లు కూడా వ‌చ్చాయి.

ఈ నెల 12 నుంచి పెళ్లి పనులు మొదలుపెట్టనున్నారు. ఈ నెల 20తో ఆషాఢ మాసం పూర్తవుతుంది. ఆ తర్వాత పెళ్లి తేదీని ఖరారు చేయాలనుకుంటున్నారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా 50 మంది అతిథుల సమక్షంలో పెళ్లి జరగనుంది.

Nithin

హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లోని ఓ ఫామ్‌హౌస్‌ వీరి పెళ్లికి వేదిక కానుందని తెలుస్తోంది. సినిమాల విషయానికొస్తే ‘భీష్మ’తో సక్సెస్ అందుకున్న నితిన్.. వెంకీ అట్లూరితో ‘రంగ్ దే’ చిత్రంతో పాటు చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలోనూ ఓ సినిమా చేస్తున్నాడు.

Read:దేవుడికి కృతజ్ఞతలు చెప్పిన బండ్ల గణేష్