Small Films Releases: స్టార్స్ లేరు.. సందడి చేస్తున్న చిన్న సినిమాలు!

ఈ వారం పేరున్న హీరోలెవరు ముందుకు రావడం లేదు. అదేనండీ థియేటర్ జోరు పెరిగాక యంగ్ హీరోలు కాస్త గట్టిగానే పోటీపడ్డా.. ఈ వీక్ మాత్రం టాలీవుడ్ సందడి తగ్గింది. అయితే బాలీవుడ్ లో మాత్రం..

Small Films Releases: స్టార్స్ లేరు.. సందడి చేస్తున్న చిన్న సినిమాలు!

Small Films Releases

Small Films Releases: ఈ వారం పేరున్న హీరోలెవరు ముందుకు రావడం లేదు. అదేనండీ థియేటర్ జోరు పెరిగాక యంగ్ హీరోలు కాస్త గట్టిగానే పోటీపడ్డా.. ఈ వీక్ మాత్రం టాలీవుడ్ సందడి తగ్గింది. అయితే బాలీవుడ్ లో మాత్రం ఓ బిగ్ మూవీ నవంబర్ 19న డేట్ ఫిక్స్ చేసుకుంది. టాలీవుడ్ టు బాలీవుడ్ ఏఏ సినిమాలు హాళ్లకు వచ్చేస్తున్నాయో ఓసారి చూద్దాం.

Star Hero Fans: ఫ్యాన్స్ సోషల్ అరాచకం.. పాపం మేకర్స్‌కు వణుకే..!

సెకండ్ వేవ్ తర్వాత సూర్యవంశీతో బాలీవుడ్‌లో కొత్త సినిమా రిలీజుల హంగామా స్టార్ట్ అయ్యింది. 2005లో బిగ్‌ బి అమితాబ్, అభిషేక్ బచ్చన్, రాణీ ముఖర్జీ లీడ్ రోల్స్ చేసిన సూపర్ హిట్ ‘బంటీ ఔర్ బబ్లీ’ కి సీక్వెల్‌గా ‘బంటీ ఔర్ బబ్లీ 2’ నవంబర్ 19న రాబోతుంది. దాదాపు 12 సంవత్సరాల తర్వాత బంటీ, బబ్లీలు థియేటర్స్ లో హల్చల్ చేయబోతున్నారు. అయితే ఈసారి నలుగురితో ఫన్ డోస్ ఇవ్వబోతున్నారు మేకర్స్. సైఫ్ అలీ ఖాన్, రాణీ ముఖర్జీ, సిద్ధాంత్ చతుర్వేది, షర్వారీ ప్రధాన పాత్రల్లో వరుణ్ వి.శర్మ డైరెక్ట్ చేశారు. ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద ఆదిత్య చోప్రా నిర్మించాడు.

Akhanda: బాలయ్య-బోయపాటి.. టాలీవుడ్ ట్రెండ్ సెట్ చేస్తారా?

గత వారమైతే ఆనంద్ దేవరకొండ, కార్తీకేయ, దుల్కర్ సల్మాన్ హీరోల మధ్య గట్టి పోటీ కనిపించింది కానీ ఈవారం టాలీవుడ్ డ్రై ఫేజ్ లో ఉంది. అయితే ఇదే అదనుగా చిన్న సినిమాలు థియేటర్స్ కు వచ్చేస్తున్నాయి. అభినవ్‌ సర్దార్‌, రామ్‌ కార్తిక్‌, చాందిని ప్రధాన పాత్రల్లో నటించిన ‘రామ్‌ అసుర్‌’ ఈ శుక్రవారమే హాళ్లకు వచ్చేస్తుంది. ముందు పీనట్ డైమెండ్ పేరుతో తెరకెక్కిన ఈ సినిమా ఓటీటీ రిలీజ్ అనుకున్నారు. కానీ విజువల్ ఎక్ట్రార్డినరిగా రావడం, సుమన్, శుభలేక సుధాకర్ వంటి సీనియర్స్ నటించడంతో…రామ్ అసుర్ గా పేరు మార్చి థియేటర్ బాట పట్టారు. వెంకటేష్‌ త్రిపర్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా… సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామాగా ముస్తాబైంది.

Hansika Motwani: యాపిల్ బ్యూటీ హన్సిక గ్లామర్ ట్రీట్!

రివేంజ్ డ్రామా బ్యాక్ డ్రాప్ తో ఈ వారమే రిలీజ్ కాబోతున్న సినిమా స్ట్రీట్ లైట్. తాన్యా దేశాయ్, అంకిత్ రాజ్, సీనియర్ యాక్టర్ వినోద్ కుమార్ వంటివారు నటించారిందులో. ఒక రాత్రి స్ట్రీట్ లైట్ కింద జరిగిన అరాచకాన్ని ఈ సినిమాలో చూపించాడు డైరెక్టర్ విశ్వ. `ప్రెజ‌ర్ కుక్క‌ర్‌` ఫేమ్ సాయి రోన‌క్‌, `90 ఎమ్ ఎల్` ఫేమ్ నేహ సోలంకి జంట‌గా న‌టించిన రీసెంట్ మూవీ ‘ఛలో ప్రేమిద్దాం’. ఉద‌య్ కిర‌ణ్‌ నిర్మిస్తున్న ఈ సినిమాని సురేష్ శేఖ‌ర్ రేప‌ల్లె డైరెక్ట్ చేసారు. ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రాబోతన్నచలో ప్రేమిద్దాం.. ప్రేమించుకుందాం రా, ప్రేమంటే ఇదేరా సినిమాల తరహాలో లవబుల్ మూవీగా తెరకెక్కిందంటున్నారు మేకర్స్.

Kamal Hasan: కమల్, విక్రమ్, సేతుపతి.. ఓ భారీ మల్టీస్టారర్!

ఈ వీక్ థియేటర్ సందడి గట్టిగా లేకపోయినా.. ఓటీటీలో మాత్రం ఫుల్ సౌండ్ వినబడబోతుంది. ఈ ఫ్రైడేను టార్గెట్ చేస్తూ మోస్ట్ అవైటైడ్ మూవీస్ కొన్ని హోమ్ ఎంట్రీ ఇచ్చేస్తున్నాయి. ముఖ్యంగా అయ్యగారు అఖిల్ సినిమా ఆల్ ఆఫ్ సడెన్ గా ఆహాలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేస్తోంది. కొవిడ్ తర్వాత సాలిడ్ హిట్ కొట్టిన అఖిల్ అక్కినేని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఓటీటీ ఎంట్రీకి సిద్ధమైంది. నవంబర్ 19 నుంచి అచ్చ తెలుగు ఓటీటీ ఆహాతో పాటూ నెట్ ఫ్లిక్స్ లో కూడా స్ట్రీమింగ్ కాబోతుంది. అఖిల్ లుక్స్ ప్లస్ బుట్టబొమ్మ గ్లామర్ డోస్ కి బొమ్మరిల్లు భాస్కర్ ఇచ్చిన ట్రీట్ మెంట్.. స్మార్ట్ స్క్రీన్ ఆడియెన్స్ ను కూడా కట్టిపడేస్తుందనే ధీమాతో ఉన్నారు మేకర్స్.

Ram Charan: జెర్సీ దర్శకుడితో స్పోర్ట్స్ డ్రామా.. చెర్రీ కల తీరేవేళ!

ఈ వారం డైరెక్ట్ ఓటీటీ ఎంట్రీ ఇచ్చేస్తున్నాడు తేజా సజ్జా. రాజశేఖర్ కూతురు శివానీ హీరోయిన్ గా నటించిన అద్భుతం మూవీ హాట్ స్టార్ లో ఈ శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. ఒకే సిమ్ కార్డ్ ఇద్దరూ వాడితే ఎలా ఉంటుందన్న డిఫరెంట్ కాన్సెప్ట్ తో టైమ్ ట్రావెలింగ్ చేయించబోతున్నారు డైరెక్టర్ మల్లిక్ రామ్. ఇప్పటికే అద్భుతం ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక గ్యాప్ ఇవ్వకుండా ఓటీటీకి వచ్చేస్తుండటంతో అక్కడ హిట్ కొడతాననే కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు తేజా సజ్జా.

Pooja Hegde: మాల్దీవుల్లో అందాల మంట పెట్టిన పూజా హెగ్డే.. బాప్ రే బికినీ షో..!

డిమానిటేసేషన్ ను బేస్ చేసుకుని హాట్ స్టార్ లో రిలీజ్ కాబోతున్న సినిమా క్యాష్. ఫన్నీ అండ్ సెటైరికల్ కాన్సెప్ట్ తో రిషభ్ సేత్ ఈ సినిమాను తెరకెక్కించాడు. అమోల్ పరేషర్, కెవిన్ డేవ్, స్మృతి కల్రా, గుల్షన్ గ్రోవ్ లీడ్ రోల్స్ చేశారిందులో. బాలీవుడ్ ఆడియెన్స్ ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న సినిమా ధమాకా. కార్తీక్ ఆర్యన్ లీడ్ రోల్ చేశాడు ఈ మూవీలో. సొత్ కొరియన్ మూవీ ది టెర్రర్ లైవ్ ఆధారంగా ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు రామ్ మద్వానీ.

Padutha Theeyaga: వారసుడి చేతుల్లోకి బాలు మానస పుత్రిక!

టెర్రరిజం బ్యాక్ డ్రాప్ లో జర్నలిస్టుల ఎదుర్కొనే సమస్యలను చూపించబోతున్నాడు కార్తీక్ ఆర్యన్. ఇప్పటికే హై స్వింగ్ లో ప్రమోషన్స్ చేస్తున్నారు మేకర్స్. నవంబర్ 19న నెట్ ఫ్లిక్స్ లో ఎలాంటి ఓపెనింగ్ సాధిస్తుందో చూడాలి. ఇండియన్ మైకేల్ జాక్సన్ గా, డ్యాన్సింగ్ డైనమైట్ గా సౌత్ లోనూ, బాలీవుడ్ లోనూ మంచి క్రేజున్న స్టార్ ప్రభుదేవా. ఆయన ఫస్ట్ టైమ్ పోలీస్ గా యాక్షన్ థ్రిల్లర్ తో వస్తున్న సినిమా ‘పొన్ మాణిక్యవేల్’. ఏసీ ముగిల్ చెల్లప్పన్ దర్శకత్వంలో నివేథా పెతురాజ్ హీరోయిన్ కాగా .. మహేంద్ర, సురేశ్ మీనన్ కీ రోల్స్ చేసారు. నిజానికి ముందు థియేటర్ రిలీజ్ అనుకున్నా ఫైనల్ గా ఓటీటీకే ఓటేసారు మేకర్స్. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ నెల 19న స్ట్రీమింగ్ కానుంది సినిమా.

Indian 2: కాజల్ స్థానంలో త్రిష.. ప్రెగ్నెన్సీయే కారణమని టాక్!

మిస్టీరియస్ సబ్జెక్ట్ తో మలయాళీ ఫిల్మ్ చురులీ ఈ వారమే సోనీ లివ్ లో స్ట్రీమింగ్ కి రెడీఅయింది. చెంబన్ వినోద్ జోస్, వినయ్ ఫోర్ట్ లీడ్ రోల్స్ లో కనిపిస్తారు. అడ్వెంచరస్ ఫాంటసీ థ్రిల్లర్ గా ఈ సినిమా సోనీ లివ్ లో రిలీజ్ కాబోతుంది. హిందీ మిస్టరీ డ్రామా యువర్ హానర్ సీజన్ 2 కూడా సోని లివ్ లోనే ఈ వీక్ స్ట్రీమింగ్ కి సిద్ధమైంది. ఫస్ట్ సీజన్ బాగా ఆకట్టుకోవడంతో సకెండ్ సీజన్ కోసం వెయిట్ చేస్తున్నారు ఆడియెన్స్. అలాగే సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ థ్రిల్లర్ ది వీల్ ఆఫ్ టైమ్ కూడా ఈ వీక్ భయపెట్టేందుకు రెడీఅయింది. అమెజాన్ ప్రైమ్ లో ఇంగ్లీషుతో పాటూ తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ది వీల్ ఆఫ్ టైమ్ ను అప్ లోడ్ చేయబోతున్నారు.