Devara : ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. దేవర కూడా రెండు భాగాలుగా..? కొరటాల శివ అప్డేట్..!
దేవర మూవీ గురించిన సూపర్ అప్డేట్ ని కొరటాల నేడు అభిమానులకు ఇచ్చాడు. ఒక స్పెషల్ వీడియోని రిలీజ్ చేసి..

NTR Devara movie is coming in two parts Koratala Siva update
Devara : ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతుంది. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీలో సైఫ్ అలీఖాన్, మలయాళ నటుడు షైన్ టామ్ చాకో విలన్స్ గా కనిపించబోతున్నారు. మిక్కిలినేని సుధాకర్ తో కలిసి నందమూరి కళ్యాణ్ రామ్ ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఈ మూవీ కోసం హాలీవుడ్ మేకర్స్ సైతం రంగంలోకి దించుతున్నారు.
Also read : Mansion 24 Trailer : భయపెట్టడానికి వస్తున్న వరలక్ష్మి.. మ్యాన్షన్ 24 గది రహస్యం ఏంటి..?
కాగా ఈ మూవీ గురించిన సూపర్ అప్డేట్ ని కొరటాల నేడు అభిమానులకు ఇచ్చాడు. ఒక స్పెషల్ వీడియోని రిలీజ్ చేసి సినిమా గురించి బిగ్ న్యూస్ చెప్పాడు. చిత్రీకరణలో ఈ మూవీ స్పాన్ ఎక్కువ అవుతుండడంతో.. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తీసుకు రాబోతున్నట్లు ప్రకటించాడు. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ‘దేవర పార్ట్ 1’ రిలీజ్ కాబోతుంది అంటూ ప్రకటించాడు. ఈ వార్తతో ఎన్టీఆర్ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.
#DEVARA pic.twitter.com/74oTrv1u2W
— Devara (@DevaraMovie) October 4, 2023
ఇక ఈ మూవీ షూటింగ్ విషయానికి వస్తే.. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. షెడ్యూల్స్ మీద షెడ్యూల్స్ ని పూర్తి చేస్తూ వస్తున్నారు. ఇటీవలే ఒక యాక్షన్ షెడ్యూల్ ని కంప్లీట్ చేశారు. నడి సముద్రంలో నైట్ యాక్షన్ సీక్వెన్స్ ని ఎన్టీఆర్ పై చిత్రీకరించారు. ఈ మూవీ ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. మరి వాటిలో ఎంత నిజముందో తెలియదు.