‘సేమ్ టు సేమ్’.. ఎన్టీఆర్ చిన్నకొడుకు పిక్ వైరల్..

ఎన్టీఆర్ రెండవ కొడుకు భార్గవ రామ్ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..

‘సేమ్ టు సేమ్’.. ఎన్టీఆర్ చిన్నకొడుకు పిక్ వైరల్..

ఎన్టీఆర్ రెండవ కొడుకు భార్గవ్ రామ్ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి, కుమారులు అభయ్ రామ్, భార్గవ రామ్‌లతో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేస్తూ ప్రేక్షకులకు, అభిమానులకు హోలీ విషెస్ తెలిపిన సంగతి తెలిసిందే. ఫ్యామిలీ అంతా వైట్ డ్రెస్‌లు ధరించి ముఖానికి రంగులు పూసుకుని ఉన్న పిక్ ఆకట్టుకుంటోంది.

ఈ ఫోటోను ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేశారు. తారక్ ఫ్యామిలీ ఫోటోకు నెటిజన్ల నుంచి విపరీతమైన స్పందన లభించింది. పార్లే జి బిస్కెట్ ప్యాకెట్ కవర్‌పై ఉండే చిన్నారితో భార్గవ రామ్‌ని పోలుస్తూ ‘సేమ్ టు సేమ్’ అని కామెంట్ చేస్తున్నారు.

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ : ‘పర్ఫెక్ట్ ఫ్యామిలీ పిక్.. ఈ ఫోటో నుంచి చూపు తిప్పుకోలేకపోతున్నా’ అని ట్వీట్ చేయగా.. హరీష్ శంకర్ : ‘ఎన్టీఆర్ చిన్న కొడుకు కెమేరా వైపు చూస్తున్న విధానం ఏదో చెబుతోంది.. వదిలితే ఇప్పుడే దూకేసేలా ఉన్నాడు’.. అంటూ ట్వీట్ చేశాడు.

See Also | హీరోయిన్ చేతిలో కండోమ్ పెట్టాడు!