సైరా – వీడియో సాంగ్ చూశారా!

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన హిస్టారికల్ మూవీ.. సైరా నరసింహారెడ్డి.. వీడియో సాంగ్ విడుదల..

  • Published By: sekhar ,Published On : September 30, 2019 / 05:24 AM IST
సైరా – వీడియో సాంగ్ చూశారా!

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన హిస్టారికల్ మూవీ.. సైరా నరసింహారెడ్డి.. వీడియో సాంగ్ విడుదల..

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన హిస్టారికల్ మూవీ.. సైరా నరసింహారెడ్డి.. అమితాబ్ బచ్చన్, నయనతార, తమన్నా, జగపతిబాబు, సుదీప్, విజయ్ సేతుపతి తదితరులు కీలక పాత్రల్లో నటించగా.. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో, కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్‌పై, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ భారీ బడ్జెట్‌తో నిర్మించాడు. 

ఇటీవల రిలీజ్ చేసిన సైరా టైటిల్ సాంగ్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అమిత్ త్రివేది కంపోజ్ చేసిన ట్యూన్‌కి ప్రముఖ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి లిరిక్స్ రాయగా, మెలోడి క్వీన్ శ్రేయా ఘోషల్, సునిధి చౌహన్ చాలా బాగా పాడారు. రీసెంట్‌గా సైరా వీడియో సాంగ్ విడుదల చేశారు. నరసింహారెడ్డి గొప్పతనం గురించి, స్వాతంత్ర్య పోరాటంలో అతని విధివిధానాల గురించి చెప్తూ సాగే ఈ పాటను భారీగా చిత్రీకరించారు.

Read Also : చిన్నారికి పేరు పెట్టిన సుప్రీమ్ హీరో..

భారీ అంచనాలతో గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ భాషల్లో ‘సైరా’  భారీగా విడుదల కానుంది. సంగీతం : అమిత్ త్రివేది, కెమెరా : రత్నవేలు, ఎడిటింగ్ : ఎ.శ్రీకర్ ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్ : రాజీవన్ నంబియార్, విఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ : కమల్ కణ్ణన్.