Mumbai : సల్మాన్ ఖాన్‌‌ను అడ్డుకున్న ఆఫీసర్‌‌కు సత్కారం, రివార్డు

బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ను ఓ సీఐఎస్ఎఫ్ అధికారి అడ్డుకున్నారనే వార్త ఇటీవలే హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూర్టీ ఫోర్స్ క్లారిటీ ఇచ్చింది.

Mumbai : సల్మాన్ ఖాన్‌‌ను అడ్డుకున్న ఆఫీసర్‌‌కు సత్కారం, రివార్డు

Salman

Salman Khan At Mumbai Airport : బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ను ఓ జవాన్ అడ్డుకున్నారనే వార్త ఇటీవలే హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. అయితే..సల్మాన్ ఖాన్ ను విమానాశ్రయంలోకి వెళ్లకుండా అడ్డుకున్న జవాన్ ఫోన్ ను సీజ్ చేసినట్లు కథనాలు వెలువడ్డాయి. దీనిపై సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూర్టీ ఫోర్స్ క్లారిటీ ఇచ్చింది. సీఐఎస్ఎఫ్ (CISF) ఆఫీసర్ ను మందలించలేదని, అతనికి సరియైన రివార్డును ప్రకటించినట్లు వెల్లడించింది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఓ ట్వీట్ చేసింది. @MeenaDasNarayan, @AmitShah, @PMOIndia లకు ట్యాగ్ చేసింది. విధులు నిర్వహిస్తున్న సమయంలో…ఆఫీసర్ అద్భుతమైన ప్రొఫెషనలిజం కనబరిచాడని, అందుకే ఆయన్ను సత్కరిస్తున్నట్లు సీఐఎస్ఎఫ్ క్లారిటీ ఇచ్చేసింది.

Read More : MPs, MLAs : ఎంపీలు, ఎమ్మెల్యేలపై పదేళ్లుగా పెండింగ్‌లో క్రిమినల్ కేసులు.. సుప్రీంకోర్టుకు అమికస్‌ క్యూరీ రిపోర్ట్

అసలు ఏం జరిగింది ?

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ‘టైగర్ – 3’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ రష్యాకు మార్చారు చిత్ర యూనిట్. దీంతో అక్కడకు వెళ్లేందుకు సల్మాన్… ముంబై విమానాశ్రయానికి వచ్చారు. కారు దిగి నేరుగా టర్మినల్ లోకి ఎంటర్ అవుతున్నారు. అక్కడనే విధులు నిర్వహిస్తున్న సీఐఎస్ఎఫ్ అధికారి…సల్మాన్ ను ఆపారు. సల్మాన్ తో పాటు..ఇతరుల డాక్యుమెంట్లు చూపించాలని సూచించారు. అధికారికి అడ్డు చెప్పలేకపోయిన సల్మాన్..డాక్యుమెంట్లు చూపించారు. అనంతరం లోపలికి అనుమతినిచ్చారు. ఈ విషయంలో అధికారిపై ప్రశంసలు కురిశాయి.