Samantha Video: సమంతా ఒక్క వీడియోకు 20లక్షల లైకులా..

సెలబ్రిటీల ఇంటి కోడలైనా.. తన వ్యక్తిత్వాన్ని పక్కకు పెట్టేయదు. సోలోగా కెరీర్ స్టార్ట్ చేసిన సమంతా ప్రతి అడుగులోనూ సొంత సత్తానే నమ్ముకుంటుంది. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ఆమె..

Samantha Video: సమంతా ఒక్క వీడియోకు 20లక్షల లైకులా..

Samantha (3)

Samantha Video: సెలబ్రిటీల ఇంటి కోడలైనా.. తన వ్యక్తిత్వాన్ని పక్కకు పెట్టేయదు. సోలోగా కెరీర్ స్టార్ట్ చేసిన సమంతా ప్రతి అడుగులోనూ సొంత సత్తానే నమ్ముకుంటుంది. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ఆమె.. ఇప్పుడు క్లాతింగ్ బిజినెస్ లోనూ కాలు పెట్టేసింది. అసలే ఫిట్‌నెస్ ఫ్రీక్‌గా కనిపించే ఆమె.. తన సొంత బిజినెస్ కు బ్రాండ్ అంబాసిడర్ గానూ వ్యవహరిస్తూ తానే ప్రమోట్ చేస్తుంది.

‘సాకి’ పేరుతో లాంఛ్‌ అయిన ఈ క్లోతింగ్‌ బ్రాండ్‌ అతి తక్కువ కాలంలోనే బాగా పాపులర్‌ అయ్యింది. ఈ దుస్తులను ప్రపంచవ్యాప్తంగా అమ్మేందుకు సిద్ధమైంది. ‘సాకి’ ఆన్‌లైన్‌ స్టోర్‌కు విదేశాల నుంచి కూడా ఆర్డర్స్‌ వస్తున్నాయిని, దీంతో అ‍మెరికా, సింగపూర్‌, మలేషియా దేశాలకు వీటిని షిప్పింగ్‌ చేస్తున్నట్లు సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొంది.

దీనికి సంబంధించిన ప్రమోషన్‌ను ఎప్పటిలా కాకుండా కొత్తగా ఆవిష్కరించింది. ‘సాకి’​ బ్రాండ్‌కు చెందిన దుస్తులను అద్దం ముందు నిలబడి ఒక్కొక్కటిగా మార్చుకుంటూ కెమెరాకు ఫోజిచ్చింది. ‘ఇన్‌స్టా’ రీల్‌తో రూపొందించిన ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అయింది. ఇప్పటికే ఈ వీడియోకు 18 లక్షలకు పైగానే లైక్స్‌ వచ్చాయి.

‘సమంత ఏం చేసినా కొత్తగానే ఉంటుంది..సూపర్భ్‌ సామ్’‌ అంటూ పలువురు నెటిజన్లు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ప్రస్తుతం గుణశేఖర్‌ దర్శకత్వంలో ‘శాకుంతలం’ అనే సినిమాలో సమంత నటిస్తున్న సంగతి తెలిసిందే. పాన్‌ ఇండియా చిత్రంగా రూపుదిద్దుకుంటోన్న ఈ మూవీ ఇటీవలె గ్రాండ్‌గా లాంఛ్‌ అయింది.ఇందులో టైటిల్‌ రోల్‌ సమంత పోషిస్తుండగా దుష్యంతుడి పాత్రలో దేవ్‌ మోహన్‌ కనిపించనున్నారు. 2022లో ఈ సినిమా విడుదల కానుంది.