Telugu Heros : ఆ సర్వేలో ఫస్ట్ ప్లేస్‌లో మహేష్ తర్వాతే అల్లు అర్జున్.. తర్వాతి స్థానాలు..

తాజాగా 2021 సంబంధించి నిర్వహించిన సర్వేలో అన్ని భాషల్లోనూ సినిమాల పరంగా, సీరియల్స్ పరంగా సర్వ్ నిర్వహించి టాప్ 10 స్టార్లను వెల్లడించారు. ఆర్మాక్స్ మీడియా నిర్వహించిన సర్వే........

Telugu Heros : ఆ సర్వేలో ఫస్ట్ ప్లేస్‌లో మహేష్ తర్వాతే అల్లు అర్జున్.. తర్వాతి స్థానాలు..

Telugu Heros

Telugu Heros :   ఇటీవల కొన్ని సంస్థలు సర్వేలు నిర్వహించి ప్రజల్లో ఎక్కువ ఎవరికీ ఫాలోయింగ్ ఉంది. ఎక్కువ ఎవర్ని ఫాలో అవుతున్నారు, ఎవర్ని ఇష్టపడుతున్నారు అని సర్వేలు నిర్వహిస్తూ ఉంటారు. ఇలా సర్వేలు నిర్వహించే మోస్ట్ పాపులర్ సర్వే కంపెనీ ఆర్మాక్స్ మీడియా ప్రతి సంవత్సరం మోస్ట్ పాపులర్ స్టార్స్ అంటూ అన్ని భాషల్లోనూ సర్వే నిర్వహిస్తుంది. తాజాగా 2021 సంబంధించి నిర్వహించిన సర్వేలో అన్ని భాషల్లోనూ సినిమాల పరంగా, సీరియల్స్ పరంగా సర్వే నిర్వహించి టాప్ 10 స్టార్లను వెల్లడించారు.

Samantha : ఫ్యామిలీమ్యాన్ డైరెక్టర్స్‌తో మరో సిరీస్‌కి ఓకే చెప్పిన సమంత

ఆర్మాక్స్ మీడియా నిర్వహించిన సర్వే ప్రకారం తెలుగు టాప్ 10 మేల్ స్టార్స్ లో మహేష్ బాబు నంబర్ 1 స్థానం సాధించారు. రెండవ స్థానంలో అల్లు అర్జున్ ఉన్నారు. ఇక వరుసగా మూడవ స్థానం నుంచి పదవ స్థానం వరకు ప్రభాస్, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, రామ్ చరణ్, నాని, విజయ్ దేవరకొండ, చిరంజీవి, రవితేజ నిలిచారు. ఈ మేరకి ఆర్మాక్స్ మీడియా తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ లిస్ట్ లో ఉన్న స్టార్స్ కి అభినందనలు తెలిపింది.