Oscar : ఆస్కార్ కి నామినేట్ అయిన ఇండియన్ సినిమాలు.. All That Breathes & The Elephant Whisperers స్టోరీలు ఏంటో తెలుసా?

RRR సినిమా నుంచి నాటు నాటు సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ కి నామినేట్ అవ్వడంతో సరికొత్త చరిత్ర సృష్టించింది. అయితే ఈ సారి ఈ ఒక్కపాటే కాకుండా ఇండియాకి మరో రెండు ఆస్కార్ నామినేషన్స్ వచ్చాయి. డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ది ఎలిఫెంట్ విస్పరర్స్, డాక్యుమెంటరీ ఫ్యూచర్ ఫిల్మ్ విభాగంలో అల్ ది బ్రీత్స్ సినిమాలు కూడా నామినేషన్స్ లో నిలిచాయి. దీంతో ఒక్కసారిగా అందరి చూపు ఈ రెండు సినిమాలపై పడ్డాయి...

Oscar : ఆస్కార్ కి నామినేట్ అయిన ఇండియన్ సినిమాలు.. All That Breathes & The Elephant Whisperers స్టోరీలు ఏంటో తెలుసా?

Oscar Nominated All That Breathes & The Elephant Whisperers stories and where to watch

Oscar :  సినిమాలకి ఇచ్చే అత్యంత ప్రతిషాత్మకమైన అవార్డు ఆస్కార్. సినిమాకి సంబంధించిన కొన్ని విభాగాల్లో ఆస్కార్ అవార్డుని ప్రతి సంవత్సరం ఇస్తారు. ఈ అవార్డు కోసం ప్రతి సినిమా వాళ్ళు కలలు కంటారు. ఈ అవార్డు నామినేషన్స్ కి ఇండియా నుంచి సినిమాలు వెళ్లడం చాలా అరుదు. ఇప్పటిదాకా మనకి వచ్చిన ఆస్కార్ అవార్డులు కూడా చేతివేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. కానీ ఈ సంవత్సరం ఇండియన్ ప్రేక్షకులు ఆస్కార్ పై ఆసక్తి చూపిస్తున్నారంటే కారణం RRR సినిమా.

RRR సినిమా నుంచి నాటు నాటు సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ కి నామినేట్ అవ్వడంతో సరికొత్త చరిత్ర సృష్టించింది. అయితే ఈ సారి ఈ ఒక్కపాటే కాకుండా ఇండియాకి మరో రెండు ఆస్కార్ నామినేషన్స్ వచ్చాయి. డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ది ఎలిఫెంట్ విస్పరర్స్, డాక్యుమెంటరీ ఫ్యూచర్ ఫిల్మ్ విభాగంలో అల్ ది బ్రీత్స్ సినిమాలు కూడా నామినేషన్స్ లో నిలిచాయి. దీంతో ఒక్కసారిగా అందరి చూపు ఈ రెండు సినిమాలపై పడ్డాయి.

ఈ రెండు సినిమాలు గత సంవత్సరమే రిలీజ్ అయి ఇప్పటికే అంతర్జాతీయంగా ఎన్నో అవార్డుల్ని గెలుచుకున్నాయి. ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ అనే సినిమా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఒక అడవిలో చిన్న గ్రామంలో ఉండే ఓ వయసుమళ్ళిన జంట ఒక అనాథ ఏనుగు పిల్లని పెంచుకుంటుంది. ఆ ఏనుగు పిల్లతో వీరి అనుబంధం, అడవి, ప్రకృతితో అనుబంధం, ఆ ఏనుగు పిల్ల చేసే అల్లరి.. ఇలా ఆ ఏనుగు పిల్ల, ఆ జంట చుట్టూ కథ ఉంటుంది. ప్రకృతి, జంతువులతో మనుషుల బంధం గురించే ఈ కథ సారాంశం. ఇప్పటికే అనేక అవార్డులు గెలుచుకున్న ఈ సినిమా ఆస్కార్ బరిలో నిలిచింది. ది ఎలిఫెంట్ విస్పరర్స్ సినిమాకి కార్తిక్ గోన్సాల్వేస్ దర్శకత్వం వహించారు.

RRR : చరిత్ర సృష్టించిన నాటు నాటు.. ఆస్కార్ నామినేషన్ దక్కించుకున్న ఫస్ట్ ఇండియన్ సాంగ్..

ఇక డాక్యుమెంటరీ ఫ్యూచర్ ఫిల్మ్ విభాగంలో నిలిచిన అల్ ది బ్రీత్స్ సినిమా ప్రస్తుతం ఎక్కడా స్ట్రీమింగ్ అవ్వట్లేదు. ఇది అమెరికాలో అవార్డుల కోసం థియేట్రికల్ రిలీజ్ అయింది. అనంతరం HBO ఛానల్ ఈ సినిమా టెలివిజన్ రైట్స్ కొనుక్కుంది. 2023లో ఈ సినిమా HBO ఛానల్ లో టెలికాస్ట్ కానుంది. ఈ డాక్యుమెంటరీ ఢిల్లీలోని వజీరాబాద్‌లో బర్డ్ క్లినిక్‌ను నడుపుతున్న నదీమ్ షెజాద్ మరియు మహ్మద్ సౌద్ అనే ఇద్దరు సోదరుల కథ. ఇక్కడ గత 20 సంవత్సరాలుగా ఎన్నో పక్షులకి వైద్యం చేస్తున్నారు. అభివృద్ధి చెందుతున్న ఢిల్లీ లాంటి నగరాల్లో కాలుష్యం, గాలిపటాలు, రకరకాల పరిస్థితులతో పక్షులు తగ్గిపోతున్నాయి. అంతేకాక అవి వివిధ సమస్యలతో బాధపడుతున్నాయి. అలాంటి పక్షులకు వైద్యం చేయడం, పక్షులు, మనుషుల మధ్య బంధాన్ని చూపించడమే ఈ సినిమా సారాంశం. ఈ సినిమాని షౌనక్ సేన్ తెరకెక్కించాడు. ఇప్పటికే అంతర్జాతీయంగా ఎన్నో అవార్డులు గెలుచుకున్న ఈ సినిమా ఆస్కార్ బరిలో నిలిచింది.

మన RRR నాటు నాటు సాంగ్ తో పాటు ఈ రెండు సినిమాలు కూడా ఆస్కార్ గెలవాలని భారతదేశం అంతా కోరుకుంటుంది. 95వ ఆస్కార్ అవార్డుల వేడుక మార్చ్ 12న జరగనుంది.