Oscar Nominations : ఆస్కార్ నామినేషన్స్ లైవ్ ఇక్కడ చూడండి.. ఎన్నింటికో తెలుసా?? RRR నిలుస్తుందా??

ఆస్కార్ నామినేషన్లు నేడు మంగళవారం జనవరి 24న కాలిఫోర్నియాలోని బెవర్లీ హిల్స్ లో ప్రకటించనున్నారు. ఈ ప్రకటన కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం కూడా చేయనున్నారు. ఈ 95వ ఆస్కార్ నామినేషన్స్ కి................

Oscar Nominations : ఆస్కార్ నామినేషన్స్ లైవ్ ఇక్కడ చూడండి.. ఎన్నింటికో తెలుసా?? RRR నిలుస్తుందా??

Oscar Nominations announcement today night 7pm as Indian time

Oscar Nominations :  సినిమా వాళ్లకి ప్రపంచంలోనే అత్యున్నతమైన అవార్డు ఆస్కార్. ఈ అవార్డు కోసం ప్రపంచంలో ఏ మూలనైనా సినిమా తీసే ప్రతి ఒక్కరు కలలు కంటారు. ఈ అవార్డు నామినేషన్స్ లో నిలిచినా చాలు అనుకుంటారు. అయితే ఈ సారి ఆస్కార్ నామినేషన్స్ ఇండియా వాళ్లకి మరింత ఆసక్తికరంగా మారాయి. ప్రపంచం మొత్తం మెచ్చిన మన తెలుగు సినిమా, రాజమౌళి తెరకెక్కించిన సినిమా RRR ఆస్కార్ నామినేషన్స్ లో నిలుస్తుందా లేదా అని అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

ఇప్పటికే ఆస్కారం క్వాలిఫై లిస్ట్ లో పలు ఇండియన్ సినిమాలు నిలవగా ఆస్కార్ నామినేషన్స్ లో మాత్రం RRR, ఛెలో షో, ఆల్ దట్ బ్రీత్స్ సినిమాలకు చోటు దక్కొచ్చని భావిస్తున్నారు. ఆస్కార్ నామినేషన్లు నేడు మంగళవారం జనవరి 24న కాలిఫోర్నియాలోని బెవర్లీ హిల్స్ లో ప్రకటించనున్నారు. ఈ ప్రకటన కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం కూడా చేయనున్నారు. ఈ 95వ ఆస్కార్ నామినేషన్స్ కి రిజ్ అహ్మద్ మరియు అల్లిసన్ విలియమ్స్ హోస్ట్ చేయనున్నారు. అమెరికన్ టైం ప్రకారం ఉదయం 8:30 amకి ఈ నామినేషన్స్ కార్యక్రమం ప్రారంభమవుతుంది. అంటే మన ఇండియన్ టైం ప్రకారం రాత్రి 7 గంటలకు ప్రసారం అవుతుంది.

ఈ 95వ ఆస్కార్ నామినేషన్ల లైవ్ కార్యక్రమాన్ని Oscar.com, Oscars.org లేదా అకాడమీ యొక్క YouTube, Facebook, Instagram, Twitterలో ప్రత్యక్ష ప్రసారంలో చూడొచ్చు. అంతేకాక మొదటి సారి ఇది Metaverse హారిజన్ వరల్డ్స్ ద్వారా వర్చువల్ రియాలిటీలో కూడా స్ట్రీమ్ అవ్వనుంది. ఇక అధికారిక 95వ ఆస్కార్ అవార్డుల వేడుక మార్చి 12 న ఓవేషన్ హాలీవుడ్‌లోని డాల్బీ థియేటర్ లో జరగనున్నాయి.

Chiranjeevi : 27 అమెరికా నగరాల్లోని ఫ్యాన్స్ తో బాస్ పార్టీ.. వేరే లెవెల్..

ఇండియన్ ప్రేక్షకులు, ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు ఈ సారి RRR సినిమా ఆస్కార్ నామినేషన్స్ లో నిలుస్తుందని భావిస్తున్నారు. ఇప్పటికే RRR సినిమా గోల్డెన్ గ్లోబ్ అవార్డు, మరిన్ని హాలీవుడ్ అవార్డులు గెలవడం, హాలీవుడ్ ప్రముఖులంతా RRR సినిమాని, రాజమౌళిని పొగడటంతో ఎలాగైనా ఈ సారి RRR సినిమాతో ఆస్కార్ కొడతామని అంతా భావిస్తున్నారు. దీంతో RRR అభిమానులు, ఇండియన్ ప్రేక్షకులు నేడు రాత్రి 7 గంటల కోసం ఎదురు చూస్తున్నారు.