భారతీయ తొలి ఆస్కార్ విజేత భాను అతయా కన్నుమూత

  • Published By: vamsi ,Published On : October 15, 2020 / 07:02 PM IST
భారతీయ తొలి ఆస్కార్ విజేత భాను అతయా కన్నుమూత

bhanu athaiya కాస్ట్యూమ్ డిజైనర్, భారత తొలి ఆస్కార్ విజేత భాను అతయ్య ఈ రోజు కన్నుమూశారు. ఆస్కార్ అవార్డు పొందిన తొలి భారతీయ వ్యక్తి భాను అతయా 91 ఏళ్ల వయస్సులో అనారోగ్యంతో మరణించారు. ముంబైలోని కొలాబాలో ఇంటి వద్ద తుది శ్వాస విడిచారు.

‘గాంధీ’ కోసం కాస్ట్యూమ్ డిజైనర్‌గా, ఉత్తమ మోస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్‌గా ఆస్కార్ అవార్డును ఆమె గెలుచుకున్నారు. ఈ చిత్రానికి మొత్తం ఎనిమిది ఆస్కార్ అవార్డులు లభించగా.. ప్రపంచ ప్రఖ్యాత చిత్రం ‘గాంధీ’ 1982లో విడుదలైంది.



భాను అతయా కుమార్తె రాధిక గుప్తా తన తల్లి మరణాన్ని ధృవీకరించారు. “తల్లికి 2012నుంచి బ్రెయిన్ ట్యూమర్ ఉంది, కానీ ఆ సమయంలో ఆమె అనారోగ్యానికి శస్త్రచికిత్స చేయించుకోవడానికి నిరాకరించింది. ఈ క్రమంలోనే 2015 లో ఆమె నడవలేని స్థితిలోకి చేరుకున్నారు.

అప్పటి నుంచి మంచం మీద గడుపుతూ ఉన్న ఆమె.. ఈ రోజు ఉదయం నిద్రపోతూ ఆమె మరణించారు. ఆమె అంత్యక్రియలు ఈ మధ్యాహ్నం చందన్వాడి శ్మశానవాటికలో జరిగాయి.



భాను అతయా చివరి చిత్రాలు 2001 లో విడుదలైన ‘లగాన్’, 2004 లో విడుదలైన ‘స్వదేశ్’. ఈ రెండు చిత్రాలకు ప్రముఖ దర్శకుడు అశుతోష్ దర్శకత్వం వహించారు. చివరిసారిగా ఆమె మరాఠీ చిత్రం ‘సిటిజెన్’ కోసం కాస్ట్యూమ్ డిజైన్ చేశారు. అదే ఆమె చివరి చిత్రం.



భాను అతయా 1956లో కాస్ట్యూమ్ డిజైనర్ గురు దత్ దర్శకత్వం వహించిన ‘సిఐడి’ చిత్రంతో సినీ జీవితాన్ని ప్రారంభించారు. గురు దత్ రూపొందించిన ‘ప్యసా’, ‘చౌద్వి కా చంద్’ చిత్రాలకు ఆమె కాస్ట్యూమ్ డిజైనర్‌గా వ్యవహరించారు. గురు దత్ తో పాటు, యష్ చోప్రా, బిఆర్ చోప్రా, విజయ్ ఆనంద్ వంటి అనేకమంది ప్రముఖులతో ఆమె కలిసి పనిచేశారు.