Hero’s : సంవత్సరానికి ఒక సినిమా రోజులు పోయాయి.. ఒకేసారి రెండు, మూడు సినిమాలను అనౌన్స్ చేస్తున్న టాలీవుడ్ హీరోలు..

కొన్ని రోజుల క్రితం వరకు స్టార్ హీరోలు అంటే సంవత్సరానికి ఒక సినిమా చేసేవాళ్ళు. ఇప్పుడు స్లోగా సినిమాలు చేసే రోజులు పోయాయి. ఒకటి సెట్స్ మీద ఉండగానే మరో సినిమాని షూటింగ్ కి రెడీ చేస్తున్నారు. ఇంకొంతమందైతే 3, 4 సినిమాలు చేస్తున్నారు. వరస పెట్టి................

Hero’s : సంవత్సరానికి ఒక సినిమా రోజులు పోయాయి.. ఒకేసారి రెండు, మూడు సినిమాలను అనౌన్స్ చేస్తున్న టాలీవుడ్ హీరోలు..

Our Tollywood Heros announcing continue movies

Hero’s :  కొన్ని రోజుల క్రితం వరకు స్టార్ హీరోలు అంటే సంవత్సరానికి ఒక సినిమా చేసేవాళ్ళు. ఇప్పుడు స్లోగా సినిమాలు చేసే రోజులు పోయాయి. ఒకటి సెట్స్ మీద ఉండగానే మరో సినిమాని షూటింగ్ కి రెడీ చేస్తున్నారు. ఇంకొంతమందైతే 3, 4 సినిమాలు చేస్తున్నారు. వరస పెట్టి సినిమా అనౌన్స్ మెంట్లు, అంతే స్పీడ్ గా షూటింగ్స్ చేసేస్తున్నారు. స్టార్ హీరోలు ఎప్పుడూ లేనంత స్పీడ్ చూపిస్తున్నారు. ఒక సినిమా కంప్లీట్ అయ్యే వరకూ వెయిట్ చెయ్యట్లేదు మనవాళ్లు. ఒకటి స్టోరీ సిట్టింగ్ లో, ఒకటి సెట్ మీద, ఒకటి ధియేటర్లో.. ఇలా వరసగా సినిమాల్ని సూపర్ స్పీడ్ గా తెరకెక్కిస్తున్నారు మన టాలీవుడ్ హీరోలు.

అసలు బ్రేకుల్లేని బుల్డోజర్ గా సూపర్ స్పీడ్ మీదున్న హీరో రవితేజ. ఒక సినిమా నుంచి మరో సినిమాని షటిల్ సర్వీస్ చేస్తూ బిజీగా ఉన్నారు. ఇప్పటికే ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాలతో నెలల గ్యాప్ లో వచ్చి హిట్స్ కొట్టాడు. ఇప్పుడు 3 సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు రవితేజ. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న రావణాసుర సుధీర్ వర్మ డైరెక్షన్లో ఈ సమ్మర్ రిలీజ్ కు రెడీ అవుతోంది. మరో పక్క టైగర్ నాగేశ్వరరావు షూట్ ఫాస్ట్ గా చేసేస్తున్నారు. అసలు ఏమాత్రం హడావిడి లేకుండా జరుగుతున్న టైగర్ నాగేశ్వరరావుకి సంబందించి లాస్ట్ షెడ్యూల్ షూటింగ్ స్టార్ట్ చేసినట్టు లేటెస్ట్ గా వీడియో రిలీజ్ చేసింది టీమ్. మరోవైపు ఇంకా కొత్త కథలు వింటున్నాడు రవితేజ.

సినిమాలు కంప్లీట్ చేసే విషయంలో టైమ్ తీసుకుంటున్నా అనౌన్స్ చెయ్యడం, సెట్స్ మీదకి తీసుకెళ్లే విషయంలో ఫుల్ స్పీడ్ చూపిస్తున్న హీరో పవన్ కళ్యాణ్ . పవన్ కళ్యాణ్ ఒక వైపు క్రిష్ డైరెక్షన్లో హరిహరవీరమల్లు మూవీ చేస్తున్నారు. ఈ సినిమా షూట్ జరుగుతుండగానే మరో వైపు సుజిత్ తో ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ అనే యాక్షన్ మూవీ కూడా మొదలుపెట్టారు. హరిహరవీరమల్లు, సుజిత్ సినిమాలతో ఆల్రెడీ ఎంగేజ్ అయ్యిఉన్న పవన్ కళ్యాణ్ అప్పుడెప్పుడో హరీష్ శంకర్ డైరెక్షన్లో ఉస్తాద్ భగత్ సింగ్ అనౌన్స్ చేసిన పవన్ సెట్స్ మీదకెళ్లడానికి రెడీ అవుతోంది. లేటెస్ట్ గా సముద్రఖని డైరెక్షన్లో సాయిధరమ్ తేజ్ తో కలిసి వినోదయసిత్తం రీమేక్ షూటింగ్ ని స్టార్ట్ చేసి ఫుల్ స్పీడ్ లో కంటిన్యూ చేస్తూ ఎక్కువ సినిమాలతో ఎంగేజ్ అయ్యారు పవన్ కళ్యాణ్.

ప్రస్తుతం ఎక్కువ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్నది మాత్రం ప్రభాస్. పాన్ ఇండియా స్టార్ గా ఉండి ఒకటి కాదు రెండు కాదు 4 సినమాలతో ఎంగేజ్ అయ్యారు రెబల్ స్టార్. ప్రభాస్ ప్రజెంట్ చేస్తున్న జానర్స్ అన్నీ డిఫరెంటే. ఓమ్ రౌత్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఆదిపురుష్ మైథాలజీ బ్యాక్ డ్రాప్ లో మరో 3 నెలల్లో ధియేటర్లోకి రాబోతోంది. ఆదిపురుష్ షూటింగ్ తో పాటే ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ సలార్ షూటింగ్ చేస్తున్నారు. ఈ సినిమాతో పాటే మారుతి సినిమా మొదలుపెట్టి అది కూడా కంటిన్యూ చేస్తున్న ప్రభాస్ నాగ్ అశ్విన్ తో ప్రాజెక్ట్ K కోసం టైమ్ స్పెండ్ చేస్తున్నారు. ఆల్రెడీ 70 పర్సెంట్ కి పైనే షూటింగ్ కంప్లీట్ చేసిన ప్రాజెక్ట్ K నెక్ట్స్ ఇయర్ ధియేటర్లోకొస్తోంది. ఈ నాలుగు కాకుండా నెక్స్ట్ ఇంకో రెండు సినిమాలు సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ఒకటి, సందీప్ వంగ దర్శకత్వంలో ఒకటి ప్రకటించారు. ఏకంగా అరడజను సినిమాలు ప్రభాస్ చేతిలో ఉన్నాయి.

Ram Charan : సల్మాన్ సినిమాలో చరణ్ స్టెప్పులు.. పూర్తిగా సౌత్ సినిమాగా మారిపోతున్న కిసీకా భాయ్ కిసీకా జాన్..

 

మొన్న మొన్నటి వరకూ ఒక్క సినిమా తోనే సరిపెట్టుకున్న విజయ్ దేవరకొండ ఇప్పుడు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు అనౌన్స్ చేశాడు. ఉన్న ఖుషీ సినిమా షూటింగ్ తోనే ఎంగేజ్ అయ్యి ఉన్న విజయ్ లేటెస్ట్ గా 2 సినిమాలు అనౌన్స్ చేశాడు. లైగర్ ఫ్లాప్ దెబ్బ గట్టిగా పడడంతో విజయ్ దేవరకొండ మొన్నటి వరకూ పెద్దగా సినిమాలేం అనౌన్స్ చెయ్యలేదు. విజయ్ నెక్ట్స్ ఏం సినిమా చేస్తాడా అని అందరూ ఆలోచించే ముందే గౌతమ్ తిన్ననూరి తో సినిమా అనౌన్స్ చేశాడు. ఈ సినిమా ఇంకా పట్టాలెక్కకముందే గీతగోవిందంతో బ్లాక్ బస్టర్ ఇచ్చిన పరశురామ్ తో మరో సినిమా అనౌన్స్ చేసి సర్ ప్రైజ్ ఇచ్చారు విజయ్ దేవరకొండ. ఇలా ఇప్పుడు మూడు సినిమాలతో బిజీగా ఉన్నాడు విజయ్. ఇలా మరింతమంది హీరోలు కూడా వీళ్ళ బాటలోనే వెళ్తూ కనీసం 2 సినిమాలు చేతిలో ఉండేలా చూసుకుంటున్నారు.