Most Handsome Asian Man: ఆసియా అందగాడు ప్రభాస్..

టాలీవుడ్ స్టార్ ప్రభాస్.. మోస్ట్ హ్యాండ్సమ్ ఏషియన్ మ్యాన్ 2021గా అగ్రస్థానంలో నిలిచాడు. ‘టాప్ టెన్ మోస్ట్ హ్యాండ్సమ్ ఏషియన్ మెన్’ జాబితాలో ఫస్ట్ ప్లేస్‌లో నిలిచిన ప్రభాస్ సూపర్ క్రేజ్ క్రియేట్ చేసుకున్నారు.

Most Handsome Asian Man: ఆసియా అందగాడు ప్రభాస్..

Prabhas

Prabhas Most Handsome Asian Men: టాలీవుడ్ స్టార్ ప్రభాస్.. మోస్ట్ హ్యాండ్సమ్ ఏషియన్ మ్యాన్ 2021గా అగ్రస్థానంలో నిలిచాడు. ‘టాప్ టెన్ మోస్ట్ హ్యాండ్సమ్ ఏషియన్ మెన్’ జాబితాలో ఫస్ట్ ప్లేస్‌లో నిలిచిన ప్రభాస్ సూపర్ క్రేజ్ క్రియేట్ చేసుకున్నారు. ఈ జాబితాలో దక్షిణ కొరియా స్టార్ కిమ్ హ్యూన్ జోంగ్ 4వ స్థానంలో, పాకిస్తాన్ హార్ట్‌త్రోబ్ ఫవాద్ ఖాన్ 8వ స్థానంలో ఉన్నారు. ఈ అరుదైన ఫీట్ సాధించిన మొదటి ఇండియా, సౌత్ ఇండియా హీరో కూడా ప్రభాసే.

Most Handsome Asian Man List:
2. పాకిస్థాన్‌కు చెందిన ఇమ్రాన్ అబ్బాస్ నఖ్వీ
3. జపాన్‌కు చెందిన జిన్ అకానిషి
4. దక్షిణ కొరియాకు చెందిన కిమ్ హ్యూన్ జోంగ్
5. వియత్నాం నుంచి న్హాన్ ఫాక్ విన్
6. చైనాకు చెందిన హువాంగ్ జియామింగ్
7. భారత్ నుంచి వివియన్ డీ సేనా
8. పాకిస్తాన్‌కు చెందిన ఫవాద్ ఖాన్
9. థాయిలాండ్ నుండి తనవత్ వట్టనాపుటి
10. తైవాన్ నుండి వాలెస్ హువో

“బాహుబలి : ది బిగినింగ్” (2015), “బాహుబలి: ది కన్‌క్లూజన్” (2017) సినిమాల తర్వాత ప్రపంచవ్యాప్తంగా తనకంటూ ఓ క్రేజ్ క్రియేట్ చేసుకున్న ప్రభాస్.. ఇండియాలో పాన్-ఇండియా చిత్రాల ట్రెండ్‌ను కూడా స్టార్ట్ చేశారు. ప్రభాస్ లుక్స్‌కు, సింప్లిసిటీకి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. ముఖ్యంగా అమ్మాయిలు. ప్రభాస్ ప్రస్తుతం ఏకంగా నాలుగు పాన్-ఇండియా సినిమాలు చేస్తున్నారు.. ఓం రౌత్ దర్శకత్వంలో “ఆదిపురుష్”, నాగ్ అశ్విన్ తో పేరు పెట్టని సైన్స్ ఫిక్షన్, రాధేశ్యామ్, సలార్ చిత్రాలలో ప్రభాస్ నటిస్తున్నాడు.

త్వరలో థియేటర్లలోకి రాబోతున్న ‘రాధే శ్యామ్’ విడుదలకు ముందే అభిమానుల అంచనాలను పెంచేస్తోంది. ఈ చిత్రం విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుండగా.. పూజా హెగ్డే ఇందులో హీరోయిన్..