Pavitra Lokesh: సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన పవిత్ర లోకేశ్.. అసత్య ప్రచారం అంటూ వారిపై ఫిర్యాదు..

సినీ నటి పవిత్ర లోకేశ్ తాజాగా సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. తనకు సంబంధించిన పర్సనల్ విషయాలను అసభ్యకరమైన పోస్టులు పెట్టి పలు యూట్యూబ్ చానల్స్, వెబ్‌సైట్స్‌లో అసత్య వార్తలు ప్రచారం చేస్తున్నారని ఆమె సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Pavitra Lokesh: సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన పవిత్ర లోకేశ్.. అసత్య ప్రచారం అంటూ వారిపై ఫిర్యాదు..

Pavitra Lokesh Files Case Against Youtube Channels In Cyber Crime Police

Updated On : November 26, 2022 / 7:01 PM IST

Pavitra Lokesh: సినీ నటి పవిత్ర లోకేశ్ తాజాగా సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. తనకు సంబంధించిన పర్సనల్ విషయాలను అసభ్యకరమైన పోస్టులు పెట్టి పలు యూట్యూబ్ చానల్స్, వెబ్‌సైట్స్‌లో అసత్య వార్తలు ప్రచారం చేస్తున్నారని ఆమె సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పవిత్ర, నటుడు నరేశ్‌ల ఫోటోలను మార్ఫింగ్ చేసి కొన్ని టీవీ చానళ్లు సైతం అసత్య వార్తలు ప్రసారం చేశాయని ఆమె ఫిర్యాదులో పేర్కొంది.

Pavitra Lokesh: నరేశ్‌తో రిలేషన్‌పై పవిత్రా లోకేశ్ ఏమందంటే?

ఇటీవల తనపై, నరేశ్‌పై సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ ఎక్కువగా చేస్తున్నారని.. ఈ విధంగా తమను వేధిస్తున్నారని ఆమె సైబర్ క్రైమ్ పోలీసులకు తెలియజేసింది. తన వ్యక్తిగత జీవితంపై ఇతరులకు ఎలాంటి అధికారం లేదని, తనకు నచ్చిన విధంగా తాను ఉంటానని పవిత్ర గతంలోనే పలు సందర్భాల్లో తెలిపింది. అయినా కూడా తనను ఈ విధంగా ట్రోలింగ్ చేయడం, నరేశ్‌తో పాటు తన ఫోటోలను మార్ఫింగ్ చేసి పదేపదే అసత్య ప్రచారంతో తమను ఇబ్బందులకు గురిచేస్తున్న పలు యూట్యూబ్ చానళ్లు, టీవీ చానళ్లపై ఆమె సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Naresh-Pavitra : హోటల్‌లో నరేశ్, పవిత్రా.. చెప్పుతో కొట్టడానికొచ్చిన నరేష్ మూడో భార్య..

దీంతో కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే తమకు సంబంధించిన అసత్య ప్రచారం చేస్తున్న కొన్ని లింక్స్‌ను పవిత్ర ఈ సందర్భంగా పోలీసులకు పంపినట్లుగా తెలుస్తోంది.