ముహూర్తం ఫిక్స్ : షూటింగ్ లో బిజీ కానున్న పవన్ కల్యాణ్

జనసేనాని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్లీ మేకప్ వేసుకోనున్నారు. సినిమా షూటింగ్ లో బిజీ కానున్నారు. జనవరి 20న పింక్ రీమేక్ సెట్స్ మీదకు వెళ్తుంది. హీరో లేకుండా దాదాపు

  • Published By: veegamteam ,Published On : January 13, 2020 / 03:42 PM IST
ముహూర్తం ఫిక్స్ : షూటింగ్ లో బిజీ కానున్న పవన్ కల్యాణ్

జనసేనాని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్లీ మేకప్ వేసుకోనున్నారు. సినిమా షూటింగ్ లో బిజీ కానున్నారు. జనవరి 20న పింక్ రీమేక్ సెట్స్ మీదకు వెళ్తుంది. హీరో లేకుండా దాదాపు

జనసేనాని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్లీ మేకప్ వేసుకోనున్నారు. సినిమా షూటింగ్ లో బిజీ కానున్నారు. జనవరి 20న పింక్ రీమేక్ సెట్స్ మీదకు వెళ్తుంది. హీరో లేకుండా దాదాపు 40 రోజుల వర్క్ ఉంది. అందుకే ముందుగా జనవరి 20 నుంచి షూటింగ్ స్టార్ట్ చేస్తున్నారు. కాగా, ఫిబ్రవరిలో పవన్ 10 రోజులు కాల్ షీట్లు ఇచ్చారు. ఆ 10 రోజులు మేకప్ వేసుకుని షూటింగ్ లో పాల్గొననున్నారు. నిర్మాత దిల్ రాజు ఈ మేరకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

అలాగే.. క్రిష్ డైరక్షన్ లో మరో సినిమా కూడా పవన్ ఓకె చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమాను కూడా పింక్ తో పాటు సమాంతరంగా చేయాలని పవన్ డిసైడ్ అయ్యారు. ముందుగా 10 రోజులు దిల్ రాజు పింక్ సినిమాకు ఇచ్చి, ఆ వెంటనే 10 రోజులు క్రిష్ సినిమాకు కేటాయించారు. అంటే వరుసగా 20 రోజులు పవన్ షూటింగ్ లలోనే గడపబోతున్నారు. అందువల్ల ఇక రాజకీయాల హడావుడికి ఆయన కాస్త దూరంగా వుండే అవకాశం ఉందని తెలుస్తోంది.

దిల్ రాజు సినిమాకు పవన్ 50 కోట్ల రెమ్యునరేషన్, లాభాల్లో కొంత శాతం వాటా తీసుకోబోతున్నారు. ఆ శాతం ఎంత అన్నది మాత్రం వారిద్దరికే తెలుసు. అయితే క్రిష్-ఎఎమ్ రత్నం సినిమాకు మాత్రం రూ.50 కోట్ల రెమ్యునరేషన్ మాత్రమే తీసుకుంటున్నారు. అంటే 2020 లో పవన్ కు రూ.100 కోట్ల ఆదాయం ఉంటుందని చెబుతున్నారు.

పింక్ రీ మేక్ లో పవన్ రెండు మూడు ఫైట్లు కూడా చేస్తారని తెలుస్తోంది. హీరోయిన్ కు ఎక్కువ ప్రాధాన్యత లేకపోయినా, ఓ పాట ఉంటుంది. పవన్ మరోసారి తన ఫ్యాన్స్ కోసం ఓ డ్యూయట్ చేయబోతున్నారు. ఈ మేరకు పవన్ కు సరిపోయే హీరోయిన్ కోసం సెర్చ్ చేస్తున్నారు.