Pepsi Aunty​ : అప్పర..రచ్చ..రచ్చ, అప్పుడు ‘భూం బద్దల్’, ఇప్పుడు ‘నా పేరే పెప్సీ ఆంటీ’

సంపత్ నంది రాసిన 'నా పేరే పెప్సీ ఆంటీ... నా పెళ్ళికి నేనే యాంటీ’ సాంగ్ కు అప్సర డ్యాన్స్ చేసింది.

Pepsi Aunty​ : అప్పర..రచ్చ..రచ్చ, అప్పుడు ‘భూం బద్దల్’, ఇప్పుడు ‘నా పేరే పెప్సీ ఆంటీ’

Mass Song

Seetimaarr Songs : టాలీవుడ్ సినిమాల్లో ఐటమ్స్ సాంగ్స్ రచ్చ రచ్చ చేస్తున్నాయి. ఈ పాటల్లో నటీమణులు అందాలను ఆరబోస్తున్నారు. ఆర్జీవీ స్ర్కీన్ మీదకు తీసుకొచ్చిన ‘అప్సర’ రచ్చ రచ్చ చేస్తోంది. ‘క్రాక్’ సినిమాలో భూ..బదల్’ అంటూ కేక పెట్టించిన ఈ భామ..లెటెస్ట్ గా ‘నా పేరే పెప్సీ ఆంటీ’ అంటూ చిందులు వేసింది. గోపీచంద్, తమన్నా జంటగా సంపత్‌ నంది దర్శకత్వంలో ‘సీటీమార్’ ఫిల్మ్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. పవన్ కుమార్ సమర్పణలతో శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ సినిమాలో ఇటీవలే టైటిల్ సాంగ్, జ్వాలారెడ్డి పాట విడుదలైన సంగతి తెలిసిందే.

gopichand

తాజాగా..2021, మార్చి 21వ తేదీ ఆదివారం ఐటమ్ సాంగ్ ను విడుదల చేసింది. సంపత్ నంది రాసిన ‘నా పేరే పెప్సీ ఆంటీ… నా పెళ్ళికి నేనే యాంటీ’ సాంగ్ కు అప్పర డ్యాన్స్ చేసింది. గ్లామరస్ ఒలికిస్తూ..ఈ ముద్దుగుమ్మ వేసిన చిందులకు యూత్ ఫిదా అయిపోతున్నారు. మాస్ పదాలకు అప్సర గ్లామర్ షో యాడ్ కావడంతో ఈ మాస్ సాంగ్ దుమ్ము రేపుతోంది.

‘మా అమ్మకు పెళ్ళి కాకముందే కడుపులో పడ్డాను… నెలలు నిండక ముందే భూమ్మీద పడ్డాను…. బారసాల కాకముందే బోర్లా పడ్డాను… టెన్త్ లోకి రాగానే వాల్ జంప్ లే చేశాను…. ఇంటర్ లోకి రాగానే బోయ్ ఫ్రెండ్ నే మార్చాను…. డిగ్రీ లోకి రాగానే దుకాణమే తెరిసేశాను… పిజీ లోకి రాగానే ప్రపంచమే చూశాను’ అంటూ…దర్శకుడు సంపత్ నంది రాసిన ఈ పాటకు మణిశర్మ ట్యూన్స్ అందించారు.

Tamanna

డౌన్ ఫాలోలో ఉన్న గోపీ చంద్ ఈ పాట కలిసి వస్తుందా ? లేదా ? అనేది సినిమా విడుదల తర్వాత తెలుస్తుంది. పవన్‌ కుమార్‌ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ‘సీటీ మార్’ ఫిల్మ్ ఏప్రిల్‌ 2న విడుదల కానుంది.