Poison: పాయిజన్” మూవీ మోషన్ పోస్టర్ ను విడుదల చేసిన నిర్మాత సి.కళ్యాణ్

ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ చేతుల మీదుగా సీఎల్‌ఎన్ మీడియా నిర్మించిన "పాయిజన్" సినిమా మోషన్ పోస్టర్‌ విడుదలైంది.

Poison: పాయిజన్” మూవీ మోషన్ పోస్టర్ ను విడుదల చేసిన నిర్మాత సి.కళ్యాణ్

Poison: ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ చేతుల మీదుగా సీఎల్‌ఎన్ మీడియా నిర్మించిన “పాయిజన్” సినిమా మోషన్ పోస్టర్‌ విడుదలైంది. ఈ సినిమా తెలుగు ,హిందీ ,తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా డిఫరెంట్ లొకేషన్లలో భారీ ఖర్చుతో ముంబై, పూణే, లోనావాలా, హైదరాబాద్ వంటి డిఫరెంట్ లొకేషన్లలో సినిమాని చిత్రీకరించారు.

డైరెక్షర్ శ్రీ రవిచంద్రన్ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లేతో తెరకెక్కించారని, ఫ్యాషన్ అండ్ గ్లామర్ ఇండస్ట్రీ బేస్డ్ మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్‌గా సినిమా రూపొందినట్లు చిత్రయూనిట్ చెబుతోంది. ఈ సినిమాకి సంబధించిన మోషన్ పోస్టర్‌ని సీ కళ్యాణ్ విడుదల చేయడం సంతోషంగా ఉందని చిత్రయూనిట్ చెబుతోంది.

ఈ సంధర్భంగా నిర్మాత సీ కళ్యాణ్ మాట్లాడుతూ.. ప్రొడ్యూసర్ ఫ్యామిలీ నాకు బాగా తెలిసిన వాళ్ళని, మూవీస్ అంటే ప్యాషనేట్‌గా ఉంటారని, మోషన్ పోస్టర్ రిలీజ్ ఈవెంట్ మా ఫ్యామిలీ ఈవెంట్‌లా అనిపించిందని అన్నారు. డైరెక్టర్ రవిచంద్రన్ మా కాంపౌండ్‌లో నుంచి వచ్చిన వ్యక్తియని, ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌లో ఈ సినిమాని తెరకెక్కించారని అన్నారు. ప్రొడ్యూసర్ శిల్పిక ఈ మూవీతో పెద్ద హిట్ కొట్టాలి హీరో రమణకు ఈ సినిమా హిట్ ఇవ్వాలని ఆశిస్తూ.. ఆల్ ది బెస్ట్ అని చెప్పారు.

డైరెక్టర్ రవిచంద్రన్ మాట్లాడుతూ.. “మా గురువు సీ కళ్యాణ్ మోషన్ పోస్టర్ విడుదల చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ మిస్టరీస్ జోనర్లో నడుస్తుంది. మూవీ చాలా బాగా వచ్చింది” అన్నారు.

Poison

Poison