Pooja Hegde : అమితాబ్‌తో కలిసి మజా యాడ్‌లో పూజాహెగ్డే..

తాజాగా పూజా హెగ్డే లిస్ట్ లో మరో యాడ్ చేరింది. ఈ సారి ఏకంగా బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్ తోనే యాడ్ కోసం స్క్రీన్ షేర్ చేసుకుంది. గతంలోనే ఈ యాడ్ షూటింగ్ సమయంలో అమితాబ్‌తో దిగిన ఫోటో....

Pooja Hegde : అమితాబ్‌తో కలిసి మజా యాడ్‌లో పూజాహెగ్డే..

Amithab Bachhan

Pooja Hegde :  పూజ హెగ్డే.. ప్రస్తుతం వరుస హిట్స్ తో, తెలుగు, తమిళ్, బాలీవుడ్లో వరుస సినిమాలతో దూసుకుపోతుంది. రెమ్యునరేషన్ కూడా పెంచేసి టాప్ హీరోయిన్ గా సెటిల్ అయింది. మరో పక్క వరుస యాడ్స్ కూడా చేస్తూ కమర్షియల్ గా బాగా సంపాదిస్తుంది. తాజాగా పూజా హెగ్డే లిస్ట్ లో మరో యాడ్ చేరింది. ఈ సారి ఏకంగా బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్ తోనే యాడ్ కోసం స్క్రీన్ షేర్ చేసుకుంది.

Rakul Preet Singh : వెబ్ సిరీస్‌లు చేస్తాను.. కానీ.. రకుల్ కండిషన్స్

గతంలోనే ఈ యాడ్ షూటింగ్ సమయంలో అమితాబ్‌తో దిగిన ఫోటో షేర్ చేసి నా ఫేవరేట్ హీరో, నా చిన్నప్పటి డ్రీం అమితాబ్‌తో కలిసి నటిస్తున్నాను అని పోస్ట్ చేసింది. అమితాబ్ బచ్చన్, పూజాహెగ్డే కలిసి మజా కూల్‌డ్రింక్ యాడ్ కోసం నటించారు. ఇటీవల షూటింగ్ చేసుకున్న ఈ యాడ్ ప్రస్తుతం రిలీజ్ అయింది. తాజాగా ఈ యాడ్‌ని తన సోషల్ మీడియాలో షేర్ చేసింది పూజ. అమితాబ్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నందుకు పూజాహెగ్డే సంబరపడిపోతుంది.

 

View this post on Instagram

 

A post shared by Pooja Hegde (@hegdepooja)