వైరల్ అవుతోన్న పవన్ టీనేజ్‌ లుక్.. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయంటున్న నాగబాబు..

  • Published By: sekhar ,Published On : September 13, 2020 / 03:46 PM IST
వైరల్ అవుతోన్న పవన్ టీనేజ్‌ లుక్.. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయంటున్న నాగబాబు..

Pawan Kalyan Rare pic gone viral: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు.. ఓ వైపు సినిమాలు మరోవైపు రాజకీయాలతో బిజీగా ఉండే పవన్.. చిన్న విరామం తర్వాత వరుసగా సినిమాలు లైన్లో పెట్టారు. లాక్‌డౌన్ కారణంగా ఖాళీ సమయం దొరకడంతో తన ఫామ్‌హౌస్‌లో పుస్తకాలతో కాలక్షేపం చేస్తున్నారు.


తాజాగా మెగా బ్రదర్ నాగబాబు, తమ్ముడు పవన్ రేర్ పిక్ ఒకటి షేర్ చేయగా బాగా వైరల్ అవుతోంది. ఆ ఫొటో చూస్తుంటే పవన్ కాలేజ్ చదివేరోజుల్లో తీసినదిలా ఉంది. ఒత్తైన జుట్టు, గెడ్డంతో టీనేజ్‌లో ఉన్న కళ్యాణ్ ఫొటో ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది.


‘‘ఇలాంటి ఫోటోలు చాలా ఉన్నాయి.. నా దగ్గర దాచనంతే..! Forever best brother… Forever love..Pawan Kalyan’’.. అంటూ ఈ ఫొటోను షేర్ చేస్తూ.. త్వరలో ఇలాంటివి మరిన్ని పిక్స్ పోస్ట్ చేయనున్నట్టు హింట్ ఇచ్చారు నాగబాబు.

https://www.instagram.com/p/CFEZFoTs43G/?utm_source=ig_web_copy_link