Prabhas Engagement: ప్రభాస్-కీర్తి సనన్ ఎంగేజ్‌మెంట్.. తూచ్ అంటోన్న సన్నిహితులు..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన పాన్ ఇండియా మూవీ ‘ఆదిపురుష్’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ సినిమాను దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించగా రామాయణం ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు చిత్ర యూనిట్. ఇక ఈ సినిమాలో రాముడి పాత్రలో ప్రభాస్ నటిస్తోండగా, సీత పాత్రలో బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ నటిస్తోంది.

Prabhas Engagement: ప్రభాస్-కీర్తి సనన్ ఎంగేజ్‌మెంట్.. తూచ్ అంటోన్న సన్నిహితులు..!

Prabhas Engagement With Kriti Sanon News Goes Viral

Prabhas Engagement: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన పాన్ ఇండియా మూవీ ‘ఆదిపురుష్’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ సినిమాను దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించగా రామాయణం ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు చిత్ర యూనిట్. ఇక ఈ సినిమాలో రాముడి పాత్రలో ప్రభాస్ నటిస్తోండగా, సీత పాత్రలో బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ నటిస్తోంది.

Prabhas : స్పెషల్ వీడియోతో మంత్రి కేటీఆర్‌కు ప్రభాస్ థాంక్స్..

అయితే ఇటీవల బాలీవుడ్ వర్గాల్లో ప్రభాస్, కృతి జోడీపై పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరు కూడా ప్రేమలో మునిగి తేలుతున్నారని బిటౌన్ వర్గాలు చెబుతున్నాయి. అంతేగాక, వీరి ప్రేమపై అనేక వార్తలు కూడా బిటౌన్‌లో వస్తున్నాయి. దీంతో ప్రభాస్, కృతి సనన్‌ల మధ్య ప్రేమ నిజమేనని.. త్వరలోనే దీనికి సంబంధించి ఏదైన గుడ్ న్యూస్ వస్తుందేమో అని అభిమానులు కూడా ఆసక్తిగా చూస్తున్నారు. ఈ క్రమంలో ప్రభాస్, కృతి సనన్‌ల ఎంగేజ్‌మెంట్‌పై కూడా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

Prabhas : ఈ సంవత్సరం ప్రభాస్ మూడు సినిమాలు రిలీజ్ చేస్తాడా??

మాల్దీవుల్లో ఈ జోడీ ఎంగేజ్‌మెంట్ జరుపుకోబోతుందనే వార్త తాజాగా నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీంతో ప్రభాస్ సన్నిహితులు ఈ వార్తలపై స్పందించారు. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని వారు అంటున్నారు. ప్రభాస్, కృతి సనన్‌ల మధ్య రిలేషన్‌పై కూడా వస్తున్న వార్తలు కేవలం పుకారేనని వారు కొట్టిపడేశారు. దీంతో ప్రభాస్ ఎంగేజ్‌మెంట్ అంటూ చక్కర్లు కొడుతున్న వార్తలకు చెక్ పడిందని చెప్పాలి. ఇక ప్రభాస్ ప్రస్తుతం సలార్, ప్రాజెక్ట్ K, మారుతి డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తూ బిజీగా ఉన్నాడు.