Prabhas : మరో బాలీవుడ్ భామకి స్పెషల్ ఫుడ్ పంపిన బాహుబలి | Prabhas sends special food to disha patani

Prabhas : మరో బాలీవుడ్ భామకి స్పెషల్ ఫుడ్ పంపిన బాహుబలి

ప్రభాస్ తన సినిమాలో ఉండే వాళ్ళకి చేసే మర్యాదలు ఏ రేంజ్ లో ఉంటాయో అందరికి తెలిసిందే. ప్ర‌భాస్ అతిథి మ‌ర్యాద‌ల‌కు ఎవ‌రైన ఫిదా కావ‌ల్సిందే. తన ఇంటి నుంచి ఫుడ్............

Prabhas : మరో బాలీవుడ్ భామకి స్పెషల్ ఫుడ్ పంపిన బాహుబలి

Disha Patani :  ప్రభాస్ వరుస భారీ సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రభాస్ హీరోగా దీపికా పదుకొనె హీరోయిన్ గా మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘ప్రాజెక్ట్ K’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. 500 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు వైజయంతి మూవీస్. ఇప్పటికే షూటింగ్ ప్రారంభమై రెండు షెడ్యూల్స్ ని కూడా పూర్తి చేసుకుంది ‘ప్రాజెక్ట్ K’. ఇందులో బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్ బచ్చన్ కూడా ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఇటీవలే మరో బాలీవుడ్ భామ దిశా పటాని కూడా ఈ సినిమాలో భాగమవ్వనున్నట్టు అధికారికంగా తెలిపింది.

ప్రభాస్ తన సినిమాలో ఉండే వాళ్ళకి చేసే మర్యాదలు ఏ రేంజ్ లో ఉంటాయో అందరికి తెలిసిందే. ప్ర‌భాస్ అతిథి మ‌ర్యాద‌ల‌కు ఎవ‌రైన ఫిదా కావ‌ల్సిందే. తన ఇంటి నుంచి ఫుడ్ తెప్పిస్తే సెట్ లో అందరికి పండుగే. వెరైటీ వంట‌లతో తన కో ఆర్టిస్టులకు అతిధి మర్యాదలు బాగానే చేస్తాడు ప్రభాస్. ప్రభాస్ ట్రీట్ ఇచ్చిన ప్రతీసారి ఆ వంటలని ఫొటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు సెలబ్రిటీలు. గతంలో ‘సాహో’ సినిమా షూటింగ్ టైంలో శ్రద్ధ కపూర్ కి, ‘సలార్’ చిత్రీకరణ షూటింగ్ లో శృతిహాసన్ కి, ‘ఆదిపురుష్’ సినిమాలో కృతిసనన్ కి, ‘ప్రాజెక్ట్ K’ స్టార్ట్ అయినప్పుడు దీపికాకి, అమితాబ్ కి ఇంటి నుంచి తెప్పించిన స్పెషల్ ఫుడ్ పెట్టడంతో వాళ్లంతా ఫిదా అయిపోయారు.

Mahesh Babu : నాన్నగారి బయోపిక్ నేను చేయను

తాజాగా ‘ప్రాజెక్ట్ K’ సినిమాలో దిశా పటాని భాగమవ్వడంతో ఆమెకు కూడా స్పెషల్ ఫుడ్ పంపించాడు ప్రభాస్. దీంతో ప్రభాస్ పంపించిన ఫుడ్ ని ఫోటో తీసి దిశా తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది. ఈ ఫొటోతో పాటు.. థ్యాంక్ యు ప్రభాస్ ఇలాంటి ఫుడ్ పెట్టి మమ్మల్ని కంట్రోల్ లో ఉండకుండా చేస్తున్నందుకు అని కామెంట్ కూడా పెట్టింది. దీంతో ప్రభాస్ అతిధి మర్యాదల్ని అటు సెలబ్రిటీలతో పాటు, ఇటు అభిమానులు కూడా మరోసారి మెచ్చుకుంటున్నారు.

 

 

 

×