MAA Elections: కోర్టు మెట్లెక్కుతున్న ”మా” ఎన్నికల గొడవలు

తెలుగు సినిమా నటుల రాజకీయాలు రాజకీయ పార్టీల వ్యూహాలను తలపిస్తున్నాయి.

MAA Elections: కోర్టు మెట్లెక్కుతున్న ”మా” ఎన్నికల గొడవలు

Prakash Raj Panel

MAA Elections: తెలుగు సినిమా నటుల రాజకీయాలు రాజకీయ పార్టీల వ్యూహాలను తలపిస్తున్నాయి. ఓడిపోయిన ప్రకాశ్‌రాజ్‌ వర్గం మొత్తం ఇప్పటికే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఎన్నికలలో క్రాస్ ఓటింగ్ జరిగిందని, పోస్టల్ బాలెట్లలో అన్యాయం జరిగిందని, మోహన్ బాబు రౌడీయిజం చేశారని, పలు ఆరోపణలు చేస్తూ.. మూకుమ్మడి రాజీనామా చేశారు. ఎన్నికల్లో గెలిచినట్లు ప్రకటించిన వారు కూడా మళ్లీ రోజుకు ఎలా ఓడిపోయారని ప్రశ్నిస్తూ పెద్ద రాజకీయమే చేసింది ప్రకాష్ రాజ్ వర్గం.

ఎన్నికల తర్వాత మేమంతా ఒక్కటే అని, ఒక్కటైపోతాం అంటూ ప్రకటించినా కూడా అది కేవలం మాటలవరకు మాత్రమే కనిపిస్తుంది. ఎన్నికల తర్వాత కూడా ఒకరిపై ఒకరు మాటలదాడి చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే లేటెస్ట్‌గా ప్రకాష్ రాజ్ వర్గం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

సోమవారం(18 అక్టోబర్ 2021) మా ఎన్నికల తీరుపై కోర్టుకు వెళ్లనున్నట్లు వెల్లడించింది ప్రకాష్ రాజ్ వర్గం. కౌంటింగ్ తీరు సరిగ్గా లేదని కోర్టుకు వెళ్లనున్నారు ప్రకాష్ రాజ్. ఎన్నికలు జరిగిన తీరుపై కూడా ప్రకాష్ రాజ్ వర్గం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే ‘మా’ పోలింగ్‌ సమయంలో మోహన్ బాబు చాలా దురుసుగా ప్రవర్తించారని ఆరోపిస్తూ.. సీసీ ఫుటేజ్ కావాలని ఎన్నికల అధికారికి కూడా లేఖ రాశారు. ఆ ఆధారాలతోనే ఇప్పుడు ప్రకాష్ రాజ్ వర్గాం కోర్టుకు వెళ్లాలని ఫిక్స్ అయినట్లుగా తెలుస్తుంది.