Jharana Das : నటి మరణంపై సంతాపం వ్యక్తం చేసిన రాష్ట్రపతి ద్రౌపది.. ఎవరు ఆ నటి?

77 ఏళ్ళ ఝరానా దాస్ వృద్ధాప్య సంబంధిత వ్యాధులతో బాధపడుతూ నేడు కనుమూశారు. ఆమె మరణవార్త సినీరంగని కలిచివేస్తుంది. కాగా ఆమె అకాల మరణానికి చింతిస్తూభారత రాష్ట్రపతి ద్రౌపది..

Jharana Das : నటి మరణంపై సంతాపం వ్యక్తం చేసిన రాష్ట్రపతి ద్రౌపది.. ఎవరు ఆ నటి?

President Droupadi Murmu condoles the death of actress Jharana Das

Jharana Das : ఒడిశా సినీరంగంలో లెజెండరీ యాక్ట్రెస్ గా తనకంటూ ఒక అధ్యాయాన్ని లికించుకున్న నటి “ఝరానా దాస్”. కళామతల్లికి ఆమె చేసిన అసమానమైన కృషికి ఒడిశా ప్రభుత్వం ఆమెను.. ఆ రాష్ట్ర అత్యున్నత పురస్కారమైన ‘జయదేవ్’ అవార్డుతో సత్కరించింది. కాగా 77 ఏళ్ళ ఝరానా దాస్ నేడు కనుమూశారు. ఆమె మరణవార్త సినీరంగని కలిచివేస్తుంది.

Ram Charan : మరో ఘనతను అందుకున్న మెగా పవర్ స్టార్..

గత కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. ఇక ఆవిడ మరణంపై ఒడిశా సీఎం సంతాపం వ్యక్తం చేయగా, భారత రాష్ట్రపతి ద్రౌపది కూడా ఆమె అకాల మరణానికి చింతిస్తూ ట్విట్టర్ వేదికగా నివాళ్లు అర్పించారు. “లెజెండరీ ఒడియా నటి ఝరానా దాస్ మరణం గురించి తెలిసి చాలా బాధపడ్డాను. ఒడియా చిత్ర పరిశ్రమకు ఆమె చేసిన విశేషమైన కృషితో, ఆమె ఎప్పటికీ గుర్తుండిపోతుంది. కుటుంబ సభ్యులకు మరియు ఆమె అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి” అంటూ సంతాపం వ్యక్తం చేశారు.

కాగా ఝరానా దాస్ సినిమాలో మాత్రమే కాకుండా రేడియో, డ్రామా మరియు వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ గా కూడా సేవలు అందించారు. అలాగే ఆమె మంచి క్లాసికల్ డాన్సర్. అంతేకాదు, దర్శకత్వం బాధ్యతలు తీసుకోని.. స్వాతంత్ర్య సమరయోధుడు మరియు మాజీ ముఖ్యమంత్రి హరేకృష్ణ మహతాబ్ జీవిత చరిత్రని డాక్యుమెంటరీగా తెరకెక్కించి ప్రశంసలు అందుకున్నారు.