ప్రియాంక చోప్రా.. కుక్కకు కాస్టలీ జాకెట్: ధర ఎంతంటే?

కుక్కపిల్ల ధరించిన డ్రెస్ చూశారా? ఎంత బాగుందో.. చలికాలం కదా? డయానాకు చలి తగలకుండా ఉండేందుకు ఈ వింటర్ జాకెట్ ను ప్రియాంక చోప్రా కొనుగోలు చేసిందట.

  • Published By: sreehari ,Published On : January 23, 2019 / 03:31 PM IST
ప్రియాంక చోప్రా.. కుక్కకు కాస్టలీ జాకెట్: ధర ఎంతంటే?

కుక్కపిల్ల ధరించిన డ్రెస్ చూశారా? ఎంత బాగుందో.. చలికాలం కదా? డయానాకు చలి తగలకుండా ఉండేందుకు ఈ వింటర్ జాకెట్ ను ప్రియాంక చోప్రా కొనుగోలు చేసిందట.

బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా నిక్ జోనాస్ జంట వివాహం అనంతరం ఇటీవలే కరేబియన్ లో హానీమూన్ ట్రిప్ ను ఎంజాయ్ చేశారు. హనీమూన్ ట్రిప్ ముగిశాక చోప్రా.. తిరిగి లాస్ ఏంజెలెస్ లోని తన ఇంటికి వెళ్లింది. ప్రస్తుతం తన తొలి యూట్యూబ్ ఒరిజినల్ ‘దివా’ ప్రాజెక్టుతో బిజీగా ఉన్న ప్రియాంక.. తీరిక సమయాల్లో తన క్యూట్ కుక్కపిల్ల డయానా చోప్రాతో సరదాగా గడుపుతోంది. దీనికి సంబంధించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫొటోలో డయానా బెడ్ పై హాయిగా విశ్రాంతి తీసుకుంటోంది. అంతేకాదు.. కుక్కపిల్ల ధరించిన డ్రెస్ చూశారా? ఎంత బాగుందో.. చలికాలం కదా? డయానాకు చలి తగలకుండా ఉండేందుకు ఈ వింటర్ జాకెట్ ను ప్రియాంక చోప్రా కొనుగోలు చేసిందట.

నైలాన్ తో తయారైన ఈ జాకెట్ పై మూడు రంగులు ఉన్నాయి. ఇంతకీ ఈ వింటర్ జాకెట్ ధర ఎంతో తెలుసా? రూ.36 వేలు. ఈ వింటర్ జాకెట్ ను తెచ్చి డయానాకు తొడిగిన ప్రియాంక అది చూసి ఎంతో మురిసిపోయింది. తన క్యూట్ డయానాకు దగ్గరకు తీసుకొని ముద్దాడుతూ సరదాగా గడిపింది. డయానా కుక్కపిల్ల ధరించిన వింటర్ జాకెట్ ఫొటోను తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో ప్రియాంక పోస్టు చేసింది. ఈ ఫొటోను పోస్టు చేసిన క్షణాల్లోనే వైరల్ గా మారింది. ఇదే ఆ ఫొటో..
Dog-Priyanaka-chopra