Maha Shivaratri : లాస్ ఏంజిల్స్‌లో భర్త నిక్‌తో కలిసి ప్రియాంక చోప్రా మహా శివరాత్రి పూజలు

ప్రియాంక చోప్రా ఎంత ఎత్తుకు ఎదిగినా భారతీయ మూలాలను, భారతదేశ సంస్కృతిని, తన అస్థిత్వాన్ని మరిచిపోనని గతంలోనే ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. దానికి తగినట్లే నిన్న మహాశివరాత్రి సందర్భంగా...

Maha Shivaratri : లాస్ ఏంజిల్స్‌లో భర్త నిక్‌తో కలిసి ప్రియాంక చోప్రా మహా శివరాత్రి పూజలు

Priyanka Chopra

 

Priyanka Chopra :  స్టార్‌ హీరోయిన్ గా ఉన్నప్పుడే ప్రియాంక చోప్రా బాలీవుడ్‌ ని వదిలేసి హాలీవుడ్ వెళ్ళిపోయింది. హాలీవుడ్ లో కూడా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. హాలీవుడ్ వెళ్లిన ప్రియాంక అక్కడే అమెరికా ఫేమస్ సింగర్ నిక్ జోనస్ ని పెళ్లి చేసుకొని స్థిరపడిపోయింది. ప్రస్తుతం అమెరికా లాస్ ఏంజెల్స్ లో భర్త నిక్ జోనస్ తో కలిసి ఉంటుంది. ప్రియాంక చోప్రా ఎంత ఎత్తుకు ఎదిగినా భారతీయ మూలాలను, భారతదేశ సంస్కృతిని, తన అస్థిత్వాన్ని మరిచిపోనని గతంలోనే ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.

Raviteja : ఆయుధంలా బతికే నా లాంటి వాడి ధైర్యం అణువణువునా.. రామారావు ఆన్ డ్యూటీ టీజర్ రిలీజ్..

దానికి తగినట్లే నిన్న మహాశివరాత్రి సందర్భంగా లాస్​ ఏంజిల్స్​లోని తన ఇంట్లో శివుడికి పూజలు చేసింది. తన ఇంట్లో కొంచెం పెద్ద శివుడి విగ్రహం ఉంది. ఆ విగ్రహం ముందు ప్రియాంక చోప్రా, నిక్​ జోనాస్ కూర్చొని కలిసి శివుడికి పూజలు చేశారు. తను శివుడికి పూజ చేస్తున్న ఫోటోని ఇంస్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తూ.. ”మహా శివరాత్రి శుభాకాంక్షలు. హరహర మహాదేవ్​. శివరాత్రి జరుపుకుంటున్న ప్రతీ ఒక్కరికీ శుభాకాంక్షలు. ఓం నమః శివాయ” అంటూ శుభాకాంక్షలు తెలిపింది.